తరుణ్, ఓవియాల ‘ఇది నా లవ్ స్టోరీ’ మూవీ రివ్యూ-రేటింగ్

సినిమా : ఇది నా లవ్ స్టోరీ
నటీనటులు : తరుణ్, ఓవియ, తదితరులు
దర్శకత్వం : రమేష్ గోపి
నిర్మాత : ఎస్.వి. ప్రకాష్
సంగీతం : శ్రీనాథ్ విజయ్
సినిమాటోగ్రఫర్ : క్రిస్టోఫర్ జోసెఫ్
ఎడిటర్ : శంకర్
బ్యానర్ : రామ్ ఎంటర్టైన్‌మెంట్స్
రిలీజ్ డేట్ : 14-02-20178

ఒకప్పుడు వరుస హిట్లతో ఫుల్ జోష్‌మీదున్న లవర్‌బాయ్ తరుణ్.. ఆ తర్వాత ఎందుకో సినిమాలు చేయడం మానేశాడు. ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత ‘ఇది నా లవ్ స్టోరీ’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. ప్యూర్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని రమేష్ గోపి దర్శకత్వం వహించాడు. పాటలు, ప్రోమోలతో ఈ చిత్రం మంచి అంచనాల్నే పెంచుకుంది. ముఖ్యంగా.. యూత్ దృష్టిని ఆకర్షించింది. మరి.. ఇది ఆడియెన్స్‌ని అలరించడంలో సక్సెస్ అయ్యిందా? తరుణ్ కమ్‌బ్యాక్‌కి ఇది సరైనదేనా? కాదా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం పదండి..

కథ :
అభి (తరుణ్) యాడ్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేసే ఒక చిన్న డైరెక్టర్. ఇతనికి ఆల్రెడీ ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉంటుంది. అయితే.. తన అన్నయ్య జీవితంలో మళ్ళీ కలరింగ్ తీసుకురావాలని అభి చెల్లెలు అనుకుంటుంది. ఓసారి షూటింగ్ కోసం అభి అరకు వెళ్ళగా.. అక్కడ శృతి అనే అమ్మాయిని కలవమని అతని చెల్లెలు బలవంతపెడుతుంది. దాంతో.. తప్పని పరిస్థితిలో అభి అందుకు ఒప్పుకుంటాడు. కానీ.. శృతి స్థానంలో అభి (ఓవియ) అనే మరో అమ్మాయి ఉంటుంది. నిజం తెలుసుకున్న అభి.. ఆమెని నిలదీస్తాడు.

అప్పుడు శృతి స్థానంలో తానెందుకు రావాల్సి వచ్చిందో అభి (ఓవియ) చెప్పడంతో అభి (తరుణ్) కూల్ అవుతాడు. అలా ఆ ఇద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం.. మెల్లగా ప్రేమకి దారితీస్తుంది. అంతా సవ్యంగా నడుస్తుందనుకునే టైంలో.. అభి (తరుణ్)పై అభి (ఓవియ) కేసు పెట్టి పోలీసులకు అప్పగిస్తుంది. ఎందుకు ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌నే పట్టిస్తుంది? అసలు శృతి స్థానంలో అభి ఎందుకు వచ్చింది? ఆల్రెడీ ఓసారి ప్రేమలో విలఫమైన అభి.. రెండోసారైనా ప్రేమను దక్కించుకుంటాడా? లేదా? అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ :
ప్రేమకథా చిత్రాలన్నాక అందులో ఫీల్ బాగుండాలి.. ప్రేక్షకుల్ని స్పందింపజేయాలి. అప్పుడే అందులో లీనమైపోయి.. సినిమాని ఎంజాయ్ చేయగలడు. కానీ.. ఈ చిత్రంలో అలాంటి ఫీల్ ఏమాత్రం లేకపోవడమే అతిపెద్ద మైనస్. ఇంకో మేజర్ మైనస్ పాయింట్ ఏంటంటే.. ఇదొక రొటీన్ కథ. దాన్నైనా చక్కగా చూపించాడా అంటే అదీ లేదు. తికమక పెట్టించేసి, తల పట్టుకునేలా చేశాడు దర్శకుడు రమేష్ గోపీ. పోనీ స్ర్కీన్‌ప్లేతో మ్యాజిక్ చేశాడా అని అనుకుంటే.. దాంతోనూ నిరాశే పరిచాడు.

ప్రస్తుత ట్రెండ్‌కి తగినట్లుగానే రమేష్ ఈ చిత్రాన్ని చాలా ఆసక్తికరంగా మొదలుపెట్టాడు. కానీ.. నడుస్తున్నకొద్దీ సినిమా పక్కదారి పడుతుంటుంది. అసలు ఇంటర్వెల్ వరకు కథేంటో రివీల్ చేయకపోవడమే పెద్ద మైనస్. ఆలోపు ఏమైనా ఎంటర్టైన్ చేశాడా అంటే.. బోరింగ్ సీన్లతో తీవ్రంగా నిరుత్సాహపరిచేశాడు. సరే.. అయ్యిందేదో అయ్యింది సెకండాఫ్ అయినా ఆసక్తికరంగా వుంటుందనుకుంటే, ఇది ఫస్టాఫ్ కంటే మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టేసింది. సింపుల్‌గా తేల్చాల్సిన సీన్లను అనవసరమైన పంచులు, సిల్లీ ప్రాసలతో తెగ ఇరిటేట్ చేసేశాడు. ఇక మధ్యలో వచ్చే పాటలు ఏమాత్రం వినసొంపుగా లేకపోవడంతో మరింత ఇరిటేట్ చేశాయి.

అప్పటివరకు ఒకత్తయితే.. ఇది మరో ఎత్తు. గతం అన్నాక మాటల్లో అయిన తేల్చాలి లేదా కరెక్ట్ ఔట్‌పుట్‌తో చూపించాలి. ఇందులో తరుణ్ గతంలో ఓవియాని, ఆమె గతంలో తరుణ్‌ని అనుకోమనడంతో ఇంకా కష్టంగా తయారైంది ఈ చిత్రం. అయితే.. హీరోహీరోయిన్ల మధ్య కొన్ని రొమాంటిక్ సీన్లు బాగున్నాయి. క్లైమాక్స్ కూడా కొంచెం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఇవి తప్ప.. సినిమా మొత్తం పరమ బోర్!

నటీనటుల పెర్ఫార్మెన్స్ :
చాలా గ్యాప్ తర్వాత చేసినప్పటికీ తరుణ్ ఇప్పటికీ అదే సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు తరుణ్. తన పాత్రలోని ఇన్నోసెన్స్, హ్యూమర్, ఎమోషన్ అన్నిటినీ సమపాళ్లలో పండించాడు. ఓవియా ఫర్వాలేదనిపించింది. ఇద్దరి మధ్య కొన్ని సీన్లు బాగున్నాయి. మిగతా నటీనటులు మామూలే!

సాంకేతిక పనితనం :
క్రిస్టోఫర్ జోసెఫ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అరకు లొకేషన్స్‌ని అందంగా చూపించాడు. శ్రీనాథ్ విజయ్ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. ఎడిటింగ్‌పై ధ్యాస పెట్టాల్సింది. నిర్మాణ విలువలు అంతంతమాత్రమే! ఇక దర్శకుడిగా గోపీ ఫెయిల్ అయ్యాడు. రొటీన్ కథనే ఎంచుకున్నా.. దాని చుట్టూ ఆసక్తికరమైన స్ర్కీన్‌ప్లే రాసుకోవచ్చు. కానీ.. రమేష్ తికమకపెట్టే కథనం, బోరింగ్ సన్నివేశాలు, చిరాకు తెప్పించే సంభాషణలతో నిరుత్సాహపరిచాడు.

చివరగా : విసుగు తెప్పించే ప్రేమకథ
రేటింగ్ : 2/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.