సైరాకు సై అంటున్న మ్యూజిక్ మ్యాస్ట్రో..?

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేయాలని చూస్తున్నారు చిత్ర యూనిట్. అయితే వారికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతుండటంతో ఈ సినిమాపై అటు మెగాఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో సైతం ఆందోళన మొదలయ్యింది. ఇదివరకు చిత్ర యూనిట్ మెంబర్స్ కొందరు ఈ సినిమానుండి వాకౌట్ చేశారు.

సైరా చిత్రానికి మ్యూజిక్ కింగ్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నట్లు గతంలో చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే కొన్ని కారణాల వల్ల రెహమాన్ ఈ సినిమా నుండి వాకౌట్ చేశాడు. ఇప్పుడు రెహమాన్ స్థానంలో సంగీతం ఎవరు అందిస్తారా అనే ప్రశ్న టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారగా మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా పేరు తాజాగా ఈ లిస్టులో చేరిపోయింది. ఇప్పటికే ఈ సినిమాకు కీరవాణి, థమన్ లాంటి పేర్లు వినిపించినా ఇప్పుడు ఇళయరాజా పేరు రావడంతో సంగీతం అందించే సత్తా ఇళయరాజాకే ఉందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ సినిమాకు సంగీతాన్ని మ్యూజిక్ మ్యాస్ట్రో అందిస్తాడా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెత్‌తో తెరకెక్కిస్తుండగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.