ఇంద్రసేన ఫస్ట్ డే కలెక్షన్స్.. డిజాస్టర్ ఓపెనింగ్స్!

బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇంద్రసేన’ నవంబర్ 30న థియేటర్స్‌లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా లాంఛ్ చేయడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధిక ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు కావడంతో ఈ సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యారు. అయితే సినిమా రిలీజ్‌తో ఆ అంచనాలు అన్నీ తారుమారు అయ్యాయి.

రొటీన్ కథను అడ్డదిడ్డంగా చూపించిన స్క్రీన్‌ప్లేతో సినిమా చూసిన ఆడియెన్స్ తలలు పట్టుకున్నారు. ఇలాంటి సినిమాలు కూడా ఉంటాయా అనే రీతిలో దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయడం, ఎక్కడా పొంతనలేని కథనంతో సదరు ప్రేక్షకుడికి చిరాకు తెప్పించాడు ఇంద్రసేన. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా పేలవమైన టాక్‌ను తెచ్చుకోవడంతో కలెక్షన్స్ ఘోరంగా వచ్చాయి. తొలిరోజు కేవలం రూ. 20 లక్షల కలెక్షన్స్ రావడంతో ఈ సినిమా విజయ్ ఆంటోని కెరీర్‌లో దారుణమైన డిజాస్టర్‌గా మిగిలింది.

అయితే వీకెండ్‌ కావడంతో ఈ సినిమా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందంటుంది చిత్ర యూనిట్. మరి ప్రేక్షకులు వారికి ఎలాంటి రిజల్ట్‌ను ఇస్తారో మరో రెండు రోజుల్లో తేలిపోతుంది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.