అదొక్కటి తప్ప.. మిగతాదంతా సేమ్ టు సేమ్!

బాలకృష్ణ, వివి వినాయక్ కాంబినేషన్‌లో ఒక మూవీ రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే! ప్రస్తుతం బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ ముగిసిన వెంటనే.. ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్ళనుంది.

2002లో ‘చెన్నకేశవ’లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న కాంబో.. ఇప్పుడు ఇన్నాళ్ళకు మళ్ళీ కలవడంతో ఈ ప్రాజెక్ట్ మీద బోలెడన్నీ అంచనాలు వచ్చిపడ్డాయి. వాటిని రీచ్ అవ్వడం కోసం వివి వినాయక్ పెద్ద ప్రణాళికలే రచించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వినాయక్ టైటిల్ దగ్గర నుంచే తన ప్రతాపం చూపించేందుకు సిద్ధమయ్యాడు.

ఇండస్ట్రీ వర్గాల రిపోర్ట్ ప్రకారం.. ఈ మూవీకి ‘ఏకే47’ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారట! బాలయ్య సినిమాలకు టైటిల్స్ కూడా ఎనర్జిటిక్‌గా ఉంటాయి కాబట్టి.. ఆ కోణంలో ఆలోచించే ఆ పేరుని ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక స్టోరీ కూడా దాదాపు ‘చెన్నకేశవ రెడ్డి’ తరహాలోనే ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని న్యూస్!

ఇందులో బాలయ్య పెద్ద ఫ్యాక్షన్ లీడర్‌గా కనిపించనున్నాడని, యాక్షన్ సీన్స్ విజువల్ ట్రీట్‌గా ఉంటాయని అంటున్నారు. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.