మహేష్25 చిత్రంలో మళ్లీ పాత పచ్చడే

కమర్షియల్ సినిమాల్లో పక్కాగా ఐటెమ్ సాంగ్స్ ఉండాల్సిందే! ఈ ఆనవాయితీని మనోళ్ళు ఎప్పట్నుంచో పాటిస్తూ వస్తున్నారు. మాస్ ఆడియెన్స్‌ని ఉత్సాహపరిచేందుకే.. ఈ స్పెషల్ పాటల మీద మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ట్రెండ్ ఎంత మారినప్పటికీ.. ఐటమ్‌కి ఉన్న వ్యాల్యూ మాత్రం తగ్గలేదు. అందుకే.. మహేష్ 25వ చిత్రంలోనూ ఒక ఐటెమ్ సాంగ్ పెట్టాలని యూనిట్ ఆలోచిస్తోంది.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగిపోయాయట! ఎంతైనా కమర్షియల్ జోనర్‌లో రూపొందుతున్న చిత్రం.. పైగా ఇందులో మహేష్ తన కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ గెడ్డం, మీసాలతో ఊరమాస్ లుక్‌లో కనిపించబోతున్నాడు కాబట్టి ‘ఐటెమ్’ సాంగ్ పెడితే ‘మాస్’కి మరింత బూస్ట్ ఇచ్చినట్లు ఉంటుందని.. ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెకండాఫ్‌ చాలావరకూ యాక్షన్ మోడ్‌లోనే సాగుతుంది కాబట్టి.. అక్కడ ఈ పాట పెడితేనే క్లిక్ అవుతుందని దర్శకుడు భావించాడట!

ట్విస్ట్ ఏంటంటే.. దేవిశ్రీప్రసాద్ ఆల్రెడీ అదిరిపోయే మాస్ ట్యూన్ అందించినట్లు టాక్! నిజానికి.. మహేష్ సినిమాల్లో దాదాపు ప్రతి ఒక్క ఐటమ్ సాంగ్ క్లిక్ అయ్యింది. మరి.. ఈసారి మహేష్25లో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Related posts:
‘ఎక్స్‌ప్రెస్’లాగే తన రెమ్యునరేషన్‌ని భారీగా పెంచేసిన రాజా
షాకింగ్: చిరంజీవి 150వ సినిమా ఆగిపోయింది!
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి అదిరే న్యూస్.. ఆ వార్త నిజమేనట.. రికార్డ్‌లు బద్దలవ్వాల్సిందే!
‘బాహుబలి-2’ ఫైనల్ కలెక్షన్స్ 1100 కోట్లు.. ట్రేడ్ వర్గాల అంచనా
చరణ్‌కి చెమటలు.. తారక్‌కి ముచ్చెమటలు!
బోయపాటి తలపై బండ వేసిన రామ్ చరణ్.. పాపం!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.