‘ఎన్టీఆర్’లో భారీ మార్పు.. ఏకంగా ‘గాంధీ’కే ఎసరు?

‘ఎన్టీఆర్’ బయోపిక్ నుంచి దర్శకుడు తేజ వాకౌట్ చేసినప్పటి నుంచి.. ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు తిరిగి ఏ డైరెక్టర్ చేపడుతాడా? అనే ఉత్కంఠ చాలారోజుల నుంచి ఉంది. స్వయంగా బాలయ్యే దర్శకత్వం చేసే ఛాన్స్ ఉందని ఆమధ్య వార్తలొచ్చినా.. తనకున్న బ్యాడ్ సెంటిమెంట్ (ఆమధ్య తన స్వీయ దర్శకత్వంలో చేయాలనుకున్న సినిమా అర్థంతరంగా ఆగిపోవడం)తో ఆ ఆలోచనని విరమించుకుని.. ఈ చిత్రాన్ని హ్యాండిల్ చేయగలిగే దర్శకుడి కోసం వేట మొదలెట్టారని తెలిసింది. ఎట్టకేలకు ఈ వేటలో ఆయనకు సరైన దర్శకుడు దొరికాడు. అతనెవరో కాదు.. జాగర్లమూడి కృష్ణ (క్రిష్)!

వీళ్లిద్దరూ ఇదివరకే ‘శాతకర్ణి’ సినిమా చేశారు. ఆ టైంలో క్రిష్ దర్శకత్వ ప్రతిభకు ఫ్లాటైనా బాలయ్య.. అతడైతేనే ఈ బయోపిక్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తాడని.. అతడికే పట్టం కట్టారు. ఆల్రెడీ ఈ ఇద్దరి మధ్య ఆ చర్చలు కూడా జరిగిపోయాయని.. ఈ నేపథ్యంలోనే క్రిష్ కొన్ని మార్పులు కూడా సూచించారని తెలిసింది. అందుకు బాలయ్య కూడా సమ్మతమేనని తెలపడం హైలైట్! ఓవరాల్‌గా మూడు గంటల సినిమా సెట్ చేయాలని క్రిష్ చెప్పడంతో.. అతని సూచన మేరకు ఆ పనులు ప్రారంభించేశారట! సినిమాల్లో హీరోల ఎలివేషన్స్ హైలైట్‌గా వుండాలంటే.. విలన్ పాత్ర తప్పనిసరిగా ఉండాలి కాబట్టి.. ఈ చిత్రంలో మాజీ ఇందిరాగాంధీని విలన్‌గా ప్రొజెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట! ఒకవేళ ఇది నిజమే అయితే.. ఈ బయోపిక్‌కి మరింత ఆకర్షణ వచ్చినట్లే!

ఇకపోతే.. ఈ చిత్రాన్ని మళ్ళీ రీలాంచ్ చేయాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నారు. జూన్ నెలలో ఆ కార్యక్రమం చేపట్టాలని ఆయన నిర్ణయించుకున్నారట! తొలుత స్ర్కిప్ట్ పనులు ఫైనల్ దశకు చేరుకున్నాక.. గ్యాప్ ఇవ్వకుండా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికల్లా ఈ చిత్రాన్ని బరిలోకి దింపాలని యూనిట్ పక్కా స్కెచ్ వేసుకున్నట్లు తెలిసింది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.