ముగ్గురి బదులు ఒక్కడే 130 కోట్లు !!

jlk 130 crores

దసరా కి విడుదలైన మూడు సినిమాలు నటరుద్ర ఎన్టీఆర్ జై లవకుశ , సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ , శర్వానంద్ ల మహానుభావుడు ల రిజల్ట్స్ ఇప్పటికే వచ్చేసాయి.జై లవకుశ ఇప్పటికే రెండు వారాలు ద్విగ్విజయంగా పూర్తిచేసుకొని మూడవవారంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమాకి రెండువారాలకే 130 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి అలాగే 76 కోట్లకి పైగా షేర్ కలెక్షన్లు కూడా వచ్చాయి. ఈ నెల 13 వరకు పెద్ద సినిమాలు ఏమి లేవు కాబట్టి అప్పటివరకు దాదాపు అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయ్యి కొంత లాభాలలో పడే అవకాశం ఉంది.

ఇక జై లవకుశ లో ఎన్టీఆర్ మూడు పాత్రలు జై, లవ , కుశుడిగా నటించగా నత్తి తో పాటు నెగటివ్ షేడ్స్ ఉన్న జై పాత్రకి జనాలు నీరాజనాలు పట్టారు. ఇంటర్వెల్ ముందు వరకు సినిమాను నడిపించిన లవ మరియు కుశ పాత్రలు, ఇంటర్వెల్ తర్వాత జై పాత్ర ముందు చాలా సాధారణంగా మిగిలిపోయాయి. అటు నెగటివ్ గాను ఇటు ఎమోషనల్ సీన్లలోను ఇరగదీసిన జై పాత్రని చూడటానికే రిపీటెడ్ ఆడియెన్స్ కూడా వసున్నారంటే ఆశ్చర్యం లేదు. క్లైమాక్స్ కి ముందర నడిచే డ్రామా సీన్ లో జై పాత్ర పెర్ఫార్మన్స్ నభూతొ నభవిష్యత్ అన్న రీతిలో నడిచి, అందరినోట శెభాష్ ఎన్టీఆర్ అనిపించుకుంది.కథగా పెద్ద సినిమాలో విషయం లేనప్పటికీ జై అన్ని తానై ఈ సినిమా విజయానికి తోడ్పడ్డాడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. నిజం చెప్పాలంటే ఇప్పటివరకు వచ్చిన 130 కోట్లు కూడా జై ఖాతాలోనే వెయ్యటం సబబేమో కదా !!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.