‘జై లవకుశ’ 3 వీక్స్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. టార్గెట్‌ రీచ్ అవుతాడా?

jai lava kusa 3 weeks worldwide collections

తన ‘జై లవకుశ’ చిత్రంతో తారక్ ఫస్ట్ వీక్‌లో బాక్సాఫీస్‌పై శివతాండవం చేశాడు కానీ.. ఆ తర్వాత డీలా పడిపోయాడు. ‘స్పైడర్’, ‘మహానుభావుడు’ చిత్రాలు రిలీజయ్యాక ఆ చిత్రం వసూళ్లు బాగా డ్రాప్ అయిపోయాయి. ‘స్పైడర్’కి డిజాస్టర్ టాక్, ‘మహానుభావుడు’ ఏ సెంటర్లకే పరిమితం కావడం వల్ల ‘జై లవకుశ’ మళ్ళీ పుంజుకుంది. ముఖ్యంగా.. వీకెండ్‌లో చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టగలిగింది. ఓవరాల్‌గా రెండో వారంలో ఫర్వాలేదనిపించే వసూళ్లతో డిస్ట్రిబ్యూటర్స్‌ని సంతృప్తి పరిచింది. అయితే.. మూడోవారంలో ఈ చిత్రం మళ్ళీ డీలా పడిపోవడంతో తక్కువ వసూళ్లే నమోదు అయ్యాయి.

ఓవరాల్‌గా.. మొత్తం మూడు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 78.58 కోట్లు (షేర్) కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా చేసిన థియేట్రికల్ బిజినెస్ రూ. 86 కోట్లు. అంటే.. ఇది సేఫ్ జోన్‌లోకి వెళ్లాలంటే ఇంకా రూ.7.5 కోట్లు కలెక్ట్ చేయాలి. టోటల్ రన్ ఎస్టిమేషన్స్ ప్రకారం చూస్తే.. అది అసాధ్యమేనని అంటున్నారు. ఆల్రెడీ ఈ మూవీని చాలా థియేటర్ల నుంచి తీసేశారు. ఇక ఈ శుక్రవారం ‘రాజుగారి గది-2’, వచ్చే వారంలో ‘రాజా ది గ్రేట్’ మూవీలు మంచి అంచనాల మధ్యే రిలీజ్ అవుతున్నాయి కాబట్టి.. అవి ‘జై లవకుశ’ వసూళ్లపై కచ్ఛితంగా ప్రభావం చూపుతాయి. టోటల్ రన్‌లో ఈ చిత్రం రూ.80 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ అంచనా. ఈ లెక్కన డిస్ట్రిబ్యూటర్స్‌కి రూ.6 కోట్ల నష్టం వాటిల్లుతుంది.

ఏరియాలవారీగా 3 వారాల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 16.50
సీడెడ్ : 12.02
వైజాగ్ : 7.00
ఈస్ట్ గోదావరి : 5.60
వెస్ట్ గోదావరి : 3.80
కృష్ణా : 4.66
గుంటూరు : 6.10
నెల్లూరు : 2.56
ఏపీ+తెలంగాణ : రూ. 58.24 కోట్లు
కర్ణాటక : 8.87
రెస్టాఫ్ ఇండియా : 2.2
ఓవర్సీస్ : 9.3
టోటల్ వరల్డ్‌వైడ్ : రూ. 78.58 కోట్లు (షేర్)

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.