జై లవ కుశ రన్‌టైమ్.. ఆకలి తీర్చనున్న ఎన్టీఆర్‌!

Jai Lava Kusa Movie Run Time Locked
Tellmeboss.net

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘జై లవ కుశ’ ఇప్పుడు యావత్ టాలీవుడ్‌ను తనవైపు తిప్పుకుంది. తాజాగా రిలీజయిన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఇక ఈ సినిమా దసరా కానుకగా ఫుల్ ట్రీట్‌ ఇవ్వడానికి రెడీ అవుతోంది. అయితే తాజాగా ఈ సినిమా రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.

Tellmeboss.net

తారక్ ట్రిపుల్‌ రోల్ చేస్తున్న ఈ సినిమా నిడివి 155 నిమిషాలుగా ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. మూడు క్యారెక్టర్స్‌కు తగిన ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్త పడ్డారట చిత్ర యూనిట్. ఇక జై పాత్రలో తారక్ తన విశ్వరూపాన్ని చూపించినట్లు మనకు ట్రైలర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా సెన్సార్‌కు వెళ్లడానికి డేట్‌ను కూడా ఫిక్స్ చేసుకుంది. సెప్టెంబర్ 14న ఈ సినిమా సెన్సార్ ముందుకు వెళుతుంది.

రాశి ఖన్నా, నివేథా థామస్‌లు హీరోయిన్స్‌గా చేస్తున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమాకు సెన్సార్ వారు ఎలాంటి సర్టిఫికెట్ ఇస్తారో చూడాలి.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.