అరాచకం సృష్టించిన తారక్.. టాప్-10లో ‘ఆ’ స్థానం!

‘జై లవకుశ’తో నటరుద్ర ఎన్టీఆర్ సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. తన రహదారిలో అడ్డుగా వున్న రికార్డులను ఒక్కొక్కటిగా పాతిపెడుతూ తారాజువ్వలా దూసుకుపోతున్నాడు. మధ్యలో ‘స్పైడర్’, ‘మహానుభావుడు’ రూపంలో పెద్ద పిడుగులుపడ్డా.. వాటి ధాటికి తట్టుకుని నిలబడటమే కాకుండా వాటికి మించిన వసూళ్లతో దుమ్ముదులిపేస్తున్నాడు. వాస్తవానికి ఆ రెండు చిత్రాలు రిలీజైనప్పుడు తారక్ కాస్త డీలాపడ్డాడు కానీ.. ఆ వెంటనే పడిలేచిన కెరటంలా మళ్ళీ ఉగ్రరూపం దాల్చాడు. ట్రేడ్ వర్గాలే షాకయ్యేలా బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నాడు. దీంతో.. 2017లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘జై లవకుశ’ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.

ట్రేడ్ లెక్కల సమాచారం ప్రకారం.. రూ.381 కోట్ల (తెలుగువెర్షన్) షేర్‌తో ‘బాహుబలి-2’ మొదటిస్థానంలో వుండగా, రూ.104.5 కోట్లతో ‘ఖైదీ నెం.150’ రెండో స్థానంలో నిలిచింది. ఆ రెండు చిత్రాల తర్వాత అత్యధిక షేర్ రాబట్టింది ‘జై లవకుశ’ సినిమానే. ఇప్పటివరకు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.77+ కోట్లు నమోదు చేసింది. ఓవైపు మిక్స్‌డ్ టాక్, మరోవైపు రెండు సినిమాలు ధీటుగా పోటీనిచ్చినప్పటికీ.. ఈ చిత్రం ఈ రేంజులో వసూళ్ల వర్షం కురిపించిందంటే అది తారక్ నటవిశ్వరూపమే కారణమని విశ్లేషకులు అంటున్నారు. ఒక్కసారి 2017 టాప్-10 సినిమాల జాబితా చూస్తే..

1. బాహుబలి-2 : 381 కోట్లు (తెలుగు వెర్షన్)
2. ఖైదీ నెంబర్ 150 : 104.5 కోట్లు
3. జై లవకుశ : 77+ కోట్లు
4. దువ్వాడ జగన్నాథం : 72 కోట్లు
5. కాటమరాయుడు : 62.5 కోట్లు
6. గౌతమీపుత్ర శాతకర్ణి : 60.6 కోట్లు
7. ఫిదా : 48.6 కోట్లు
8. నేను లోకల్ : 37.2 కోట్లు
9. శతమానం భవతి : 34.1 కోట్లు
10. రారండోయ్ వేడుక చూద్దాం : 28.3 కోట్లు

Related posts:
వివాదాల సుడిగుండంలో వెంకీ హీరోయిన్‌
రక్షక్ మహూర్తం కన్ఫర్మ్ చేసుకున్న చెర్రీ
సునీల్ ‘జక్కన్న’ ఫస్ట్ లుక్ లాంచ్.. ట్విస్టులే ట్విస్టులు బాబోయ్!
మలయాళ సినీ ఇండస్ట్రీకి మరో షాక్.. నటుడు జిష్ణు రాఘవన్ మృతి
ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌తో లెక్క తేల్చేసిన భాగమతి
#ఎన్టీఆర్28 ఫస్ట్‌లుక్ : అల్ట్రా క్లాస్ లుక్‌లో తారక్ అదుర్స్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.