జైసింహా 10 రోజుల కలెక్షన్స్.. పాతికతో బాలయ్య ప్రతాపం!

నందమూరి నటసింహం బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ జైసింహా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్ర రిలీజ్‌కు రెండు రోజుల ముందే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం రిలీజ్ కావడంతో ఈ సినిమాపై చాలా సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే అజ్ఞాతవాసికి నెగెటివ్ టాక్ రావడంతో అదికాస్త బాలయ్యకు ప్లస్ పాయింట్‌గా మారింది. దీంతో జైసింహా చిత్రం సంక్రాంతి బరిలో విజేతగా నిలిచిందని చెప్పొచ్చు.

ఇక బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్లు ఉండే మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉండటంతో కేవలం నందమూరి అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులకు సైతం జైసింహా చిత్రం నచ్చేసింది. ఈ క్రమంలో 10 రోజులు పూర్తి చేసుకున్న జైసింహా చిత్రం ఏకంగా రూ. 25.23 కోట్లు వసూలు చేసి బాలయ్యకు మరో హిట్‌ను అందించింది. ఈ చిత్రంతో బాలయ్య కెరీర్‌లో నాలుగు 25 కోట్ల సినిమాలు చేరిపోయాయి. జైసింహా 10 రోజుల కలెక్షన్స్ ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి..

ఏరియా – 10 రోజుల కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 4 కోట్లు
సీడెడ్ – 5.30 కోట్లు
ఉత్తరాంధ్ర – 3.44 కోట్లు
గుంటూరు – 2.37 కోట్లు
తూర్పు గోదావరి – 2.44 కోట్లు
పశ్చిమ గోదావరి – 2.04 కోట్లు
కృష్ణా – 1.61 కోట్లు
నెల్లూరు – 1.23 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 22.43 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 2 కోట్లు
ఓవర్సీస్ – 0.80 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 25.23 కోట్లు

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.