‘జై సింహా’.. 50 కొట్టడం ఖాయం!

Jai Simha To Do 50 Crore Pre Release Business
Tellmeboss.net

‘సింహా’ సినిమాకి ముందు బాలయ్య మార్కెట్ 20-25 కోట్ల మధ్యే ఉండేది. కానీ.. ఆ మూవీ తర్వాత లెక్కలు మారిపోయాయి. బాలయ్య కూడా బాక్సాపీస్‌ని దబిడిదిబిడి చేయడం ప్రారంభించడంతో సినిమా సినిమాకి ఆయన మార్కెట్ పెరుగుతూ వచ్చింది. ‘శాతకర్ణి’తో ఆయన ఏకంగా రూ.50 కోట్ల (షేర్) క్లబ్‌లోకి చేరి.. తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. ఆ దెబ్బతో బాలయ్య మార్కెట్ వ్యాల్యూ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో.. ఈయన చేస్తున్న సినిమాల రైట్స్ భారీ రేట్లు పలుకుతున్నాయి. ఆల్రెడీ ‘పైసా వసూల్’ రూ.46 కోట్లమేర బిజినెస్ చేయగా.. ఇప్పుడు చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘జై సింహా’ రూ.50 కోట్లు చేసే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.

Tellmeboss.net

ముందుగా థియేట్రికల్ రైట్స్ విషయానికొస్తే.. కొన్ని ఏరియాల్లో బాలయ్య గత చిత్రాలకంటే ఎక్కువ రేట్లకే ‘జై సింహా’ రైట్స్ సోల్డ్ అవుతున్నాయి. ఇప్పటికే ఈస్ట్ గోదావరి రైట్స్‌ని ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ రూ.2.75 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది బాలయ్య కెరీర్‌లోనే రికార్డ్ ఫిగర్. ఫస్ట్‌లుక్ రిలీజైన తర్వాత చిత్రంపై విపరీతమైన హైప్ పెరగడం వల్ల రైట్స్‌కి ఇలా రేట్స్ వస్తున్నాయని నిపుణుల అభిప్రాయం. ఇలాగే అన్ని ఏరియాల నుంచి వస్తున్న ఆఫర్స్‌ని బట్టి చూస్తే.. వీటితోపాటు శాటిలైట్, హిందీ, ఆడియో రైట్స్ కలిపి ఈ మూవీ రూ.50 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన నిర్మాతకి ప్రాఫిట్స్ వచ్చినట్లే.. కానీ బయ్యర్స్ పరిస్థితే రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది.

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన నయనతార, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తుండగా.. నతాషా దోషీ ఓ కీలకపాత్ర పోషిస్తుంది. మొన్నీమధ్య వైజాగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.