జనసేన పార్టీ.. వెంకీ సాక్షిగా ఇదొక పెద్ద కాపీ!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి పవన్ రాజకీయాల్లో చాలా చురుగ్గా కదులుతున్నాడు. అయితే తాజాగా జనసేన పార్టీపై ఒక ఇంట్రెస్టింగ్ వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. జనసేన పార్టీ పేరును వెంకటేష్ నుండి పవన్ కాపీ కొట్టాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో వెంకటేష్ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన ‘నమో వెంకటేశ’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో వెంకటేష్ ఇంట్రొడక్షన్ సీన్‌లో జనసేన పార్టీ పేరును మనం చూడొచ్చు. వెంట్రిలాక్విస్టు అయిన వెంకీ.. ఆ పార్టీ కార్యక్రమంలో జనాల్ని అలరించేందుకు ఒక పెర్ఫామెన్స్ ఇస్తాడు. అప్పుడు బ్యాగ్రౌండ్లో ‘మనం-జనం కలిస్తే ప్రభంజనం జనసేన పార్టీకి ఓటేద్దాం’ అన్న నినాదం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇదే విషయాన్ని కొందరు పవన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.

పవన్ కనీసం పార్టీ పేరును కూడా సొంతంగా నిర్ణయించుకోలేకపోయాడంటూ వారు కొత్త వివాదానికి తెరలేపుతున్నారు. మరి ఈ విషయం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.

Related posts:
‘ప్రేమమ్’ బ్యూటీని బుట్టలో పడేసిన శర్వానంద్
ఫస్ట్ లవర్ గురించి శృతి చెప్పిన షాకింగ్ నిజాలు
‘జై లవ కుశ’ ట్రైలర్‌లో ఈ ట్విస్ట్ గమనించారా..?
మెగా ఫ్యాన్స్‌కు షాక్.. గుట్టు చప్పుడు కాకుండా చరణ్ సినిమా రిలీజ్!
బాహుబలి రైటర్‌తో దాదాగిరి అంటున్న సప్తగిరి!
అమ్మాయిల వెంట పడుతున్న మజ్నులు.. ఎవరు కుదురుతారో మరి?

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.