‘జవాన్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. తుక్కు రేగ్గొట్టిన తేజు

jawaan first day collections in telugu states
Tellmeboss.net

సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘జవాన్’ చిత్రం తొలిరోజు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే కొల్లగొట్టింది. వరుసగా రెండు ఫ్లాపులతో తేజు మార్కెట్ కాస్త తగ్గినా, బరిలో ఇతర సినిమాలు పోటీగా ఉన్నా, రివ్యూ-రేటింగ్‌లు అంతగా ప్రోత్సాహకరంగా లేకపోయినా, మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. ఈ చిత్రం తుక్కు రేగ్గొట్టింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే రూ.3.09 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ కొల్లగొట్టింది.

Tellmeboss.net

నిజానికి.. మెగాహీరోకి ఈ మార్క్ తక్కువే అయినప్పటికీ అన్నీ అడ్డంకులని ఎదుర్కొని ఆమాత్రం రాబట్టడం నిజంగా విశేషమేనని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. ఈ చిత్రం ఇదే దూకుడు కొనసాగిస్తే.. ఖచ్ఛితంగా ఇది కమర్షియల్‌గా హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రానికి ఉన్న ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. వచ్చే రెండు వారాల్లో పెద్ద సినిమాలేవీ రిలీజ్‌కి లేకపోవడం. కొన్ని సినిమాలైతే విడుదల అవుతున్నాయి కానీ.. అవేవీ ‘జవాన్’ వసూళ్లపై పెద్దగా ప్రభావం చూపించవు. సో.. ఈ చిత్రం దాదాపు సేఫ్ జోన్‌లోకి చేరే అవకాశం ఉందన్నమాట. మరి.. తేజు ఈసారైనా ప్లస్ రిజల్ట్‌తో హిట్ సాధిస్తాడా? లేదా మళ్ళీ నష్టాలతో ఫ్లాప్ మూటగట్టుకుంటాడా? వేచి చూడాల్సిందే.

ఏరియాలవారీగా ఫస్డ్ డే కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 1.05
సీడెడ్ : 0.60
గుంటూరు : 0.37
ఉత్తరాంధ్ర : 0.35
ఈస్ట్ గోదావరి : 0.26
కృష్ణా : 0.19
వెస్ట్ గోదావరి : 0.16
నెల్లూరు : 0.11
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ.3.09 కోట్లు (షేర్)

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.