జవాన్ ప్రీ-రిలీజ్ బిజినెస్‌.. తేజు మామూలుగా లేడుగా!

కేవలం టీజర్, ట్రైలర్స్‌తోనే టాలీవుడ్ ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేసిన సినిమాల్లో ‘జవాన్’ కూడా ఒకటి. మెగా హీరో సాయి ధరమ్ తేజ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడి డిసెంబర్ 1న రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమాపై సాయి ధరమ్ తేజ్ మంచి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. అందుకు ముఖ్య కారణం జవాన్ సినిమా కథే అంటున్నాడు ఈ మెగా హీరో. రైటర్ నుండి డైరెక్టర్‌గా మారిన బివిఎస్ రవి ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాడు.

ఇక జవాన్ సినిమా టీజర్, ట్రైలర్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ. 19 కోట్లు(అన్ని ఖర్చులను కలుపుకుని)కు అమ్ముడయ్యాయి. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పాక్షికంగా ప్రొడ్యూస్ చేయడంతో నైజాం, ఉత్తరాంధ్ర, కృష్ణా జిల్లాలో ఆయనే రిలీజ్ చేస్తున్నాడు. ఇక మిగతా ఏరియాల్లో ఈ చిత్రాన్ని సొంతంగా రిలీజ్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఏరియా వారిగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.

జవాన్ ఏరియాల వారిగా జరిగిన ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు:
నైజాం – 5.40 కోట్లు
సీడెడ్ – 3 కోట్లు
ఆంధ్రా – 7.5 కోట్లు
ఏపీ+తెలంగాణ – 15.90 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.10 కోట్లు
టోటల్ ఇండియా – 17 కోట్లు
యూఎస్ – ఓన్ రిలీజ్

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.