‘జయ జానకి నాయక’ మూవీ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్

jjn-review-rating
Tellmeboss.net

సినిమా : జయ జానకి నాయక
నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్య జైస్వాల్, జగపతిబాబు, శరత్ కుమార్, తదితరులు
దర్శకత్వం : బోయపాటి శ్రీను
నిర్మాత : మిర్యాల రవీంద్రరెడ్డి
సంగీతం : దేవిశ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ : రిషి పంజాబీ
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్ : ద్వారకా క్రియేషన్స్

ఊరమాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘జయ జానకి నాయక’. బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రంపై మొదటినుంచే మంచి అంచనాలున్నాయి. కారణం.. దర్శకుడు బోయపాటి కావడమే. అతనికున్న మాస్ ఇమేజ్ ఈ చిత్రంపై ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఏకంగా రూ.34 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. దీన్ని బట్టి.. బోయపాటి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి.. అందుకు తగినట్లుగానే ఈ చిత్రం ఆడియెన్స్‌ని అలరించిందా? లేదా? రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ :
చక్రవర్తి గ్రూప్ అఫ్ కంపెనీస్‌కి ఎండీ అయిన చక్రవర్తి (శరత్ కుమార్)కి గగన్ (బెల్లంకొండ శ్రీనివాస్), నందు అనే ఇద్దరు కొడుకులు వుంటారు. వీళ్లు ముగ్గురు స్నేహితులుగా ఎంతో అన్యోన్యంగా వుంటారు. వీరి లైఫ్ ఎలాంటి కష్టాలు లేకుండా సాఫీగా సాగిపోతుంటుంది. ఇలాంటి టైంలో గగన్ లైఫ్‌లోకి జానకి (రకుల్ ప్రీత్ సింగ్) ఎంటర్ అవుతుంది. ఆమెతో తండ్రి, కొడుకులు ముగ్గురు అనుబంధం పెంచుకుంటారు. ఆమెకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలని గగన్ దగ్గర నుంచి శరత్ మాట తీసుకుంటాడు.

అంతా సవ్యంగా సాగుతోందనుకుంటున్న సమయంలో కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాటి కారణంగా గగన్‌కి జానకి దూరం అవుతుంది. ఆపై ఆమె మరిన్ని ఇబ్బందుల్లో చిక్కుకుంటుంది. ఆ తర్వాత ఏమైంది? అసలు గగన్‌కి జానకి ఎందుకు దూరం అవుతుంది? ఆమెని ఎవరు ఇబ్బంది పెడుతుంటారు? జానకిని సమస్యల నుంచి గగన్ ఎలా బయటికి తీసుకొచ్చాడు? ఇక అశ్వద్ నారాయణ్ వర్మ(జగపతి బాబు), అరుణ్ పవార్(తరుణ్ అరోరా)తో గగన్ ని ఉన్న శత్రుత్వం ఏంటి? అనే అంశాలతో ఈ సినిమా కథ నడుస్తుంది.

విశ్లేషణ:
బోయపాటి సినిమాలంటే.. ఊరమాస్ ఎలిమెంట్స్ పతాకాస్థాయిలో కంపల్సరీ వుంటాయి. ఇందులోనూ అవి పుష్కలంగా వున్నాయి. బోయపాటి తన మార్క్ స్టైల్‌లోనే ఈ చిత్రాన్ని పూర్తి మాసిజంతో తెరకెక్కించాడు. దీంతోపాటు లవ్ స్టోరీని కూడా బాగా హైలైట్ చేశాడు. వాస్తవానికి.. బోయపాటి సినిమాల్లో లవ్ స్టోరీ ఏదో సినిమాకి తప్పనిసరిగా వుండాలి కాబట్టి అన్నట్లు వుంటాయి. కానీ.. ఈ చిత్రంలో అలా కాదు. హీరో, హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీని బాగా హైలైట్ చేశాడు. ప్రేమకోసం ఎంతవరకైనా వెళ్లొచ్చన్న అంశాన్ని అతను ప్రెజెంట్ చేసిన విధానానికి ఫిదా అయిపోతారు. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్‌కి కూడా ప్రాధాన్యత ఇచ్చాడు. కామెడీ ట్రాక్స్‌ని బాగా మలిచాడు. కథ పాతదే అయినప్పటికీ.. బోయపాటి తనదైన స్టైల్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

Tellmeboss.net

ఫస్టాఫ్ మొత్తం హీరో, హీరోయిన్ల లవ ట్రాక్, కామెడీ ఎపిసోడ్స్‌తో సరదాగా సాగిపోతుంది. ముఖ్యంగా.. కాలేజ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య నడిచే ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. మాస్ హీరోని క్లాస్‌గా మార్చడానికి రకుల్ చేసే ప్రయత్నాలు సరదాగా అనిపిస్తాయి. కామెడీ కూడా బాగానే పండింది. అక్కడక్కడ వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఎనర్జిటిక్‌గా వున్నాయి. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ ఓ అదిరిపోయే ట్విస్ట్‌తో ముగిసి, సెకండాఫ్‌పై భారీ అంచనాలు పెంచుతుంది. సెకండాఫ్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్లతో, ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాతో సాగుతుంది. యాక్షన్ సీన్లు వీర లెవెల్‌లో వున్నాయి. హీరో బెల్లంకొండ ఆ సీన్లలో ఇరగదీసేశాడు. ఇక క్లైమాక్స్ ఓ అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్‌తో, ఎమోషన్‌తో ముగుస్తుంది. ఓవరాల్‌గా.. బోయపాటి మార్క్ కమర్షియల్ సినిమా.

మైనస్ పాయింట్స్ ఏంటంటే.. కథ పాతదే కావడం. ఎక్కడ కొత్తదనం లేకుండా కథ రొటీన్‌గా సాగిపోతుంది. మధ్యలో ఎలాంటి ట్విస్టులూ వుండవు. అక్కడక్కడ లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి. (బోయపాటి చిత్రాల్లో అది కామన్). సినిమా చూస్తున్నంతసేపూ.. ఆల్రెడీ ఈ సినిమా చూశామన్న ఫీల్ కలుగుతూ వుంటుంది. ఫస్టాఫ్‌ని బాగా మలిచి ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసిన బోయపాటి.. సెకండాఫ్‌లో ఆ ఈజ్‌ని కొనసాగించలేకపోయాడు.

నటీనటుల పెర్ఫార్మెన్స్:
ముందుగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గురించి మాట్లాడుకుంటే.. గత రెండు సినిమాలతో పోల్చుకుంటే అతని పెర్ఫార్మెన్స్ బాగా మెరుగుపడింది. డైలాగ్, బాడీ లాంగ్వేజ్‌లు పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యాయి. యాక్షన్ ఎపిసోడ్స్‌లో చీల్చి చెండాడేశాడు. గగన్ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. కాకపోతే.. ఎమోషనల్ సీన్లలో ఎక్స్‌ప్రెషన్స్ తేడా కొట్టేసినట్లు కనిపిస్తోంది. ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మూవీకి మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఆమె తన నటనాప్రతిభతో ఆకట్టుకుంది. రెండు రకాల వేరియేషన్స్‌ని సూపర్బ్‌గా ప్రెజెంట్ చేసింది. విలన్‌గా దూసుకుపోతున్న జగపతిబాబు.. ఇందులోనూ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కీలకపాత్ర పోషించిన శరత్ కుమార్ నేచురల్ యాక్టింగ్‌తో మెప్పించాడు. మెయిన్ విలన్‌గా చేసిన తరుణ్ అరోరా, హీరో అన్నగా చేసిన నందు వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక సెకండ్ హీరోయిన్ గా చేసిన ప్రగ్యా, మినిస్టర్‌గా చేసిన సుమన్ వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం :
రిషీ పంజాబీ సినిమాటోగ్రఫీ అద్భుతంగా వుంది. తన కెమెరా పనితనంతో ఆద్యంతం విజువల్ ట్రీట్ అందించాడు. రాకింగ్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి తగిన విధంగా అందించాడు. రామ్‌-లక్ష్మణ్‌లు తమ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో మెప్పించాడు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ పర్వాలేదు. మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మాణ విలువలు అదిరిపోయాయి. ఇక బోయపాటి గురించి మాట్లాడుకుంటే.. బోయపాటి తన మార్క్ మాసిజంతో ఈ చిత్రాన్ని బాగానే తెరకెక్కించాడు. కాకపోతే.. ఎలాంటి కొత్తదనం లేకుండా పాత కథతోనే చిత్రాన్ని లాగించేశాడు. లాజిక్స్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది.

చివరగా : ‘జయ జానకి నాయక’.. బోయపాటి మార్క్ మూవీ.
రేటింగ్ : 3/5

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.