దుమ్ములేపిన జయ జనాకి నాయక.. పెద్దది కాదు చిన్నది!

మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘‘జయ జానకి నాయక’’ చిత్రం ఓ సరికొత్త రికార్డును కొట్టేసింది. అదేంటి.. ఈ సినిమా అప్పుడెప్పుడో వచ్చిపోతే ఇప్పుడు రికార్డు కొట్టడం ఏమిటీ..? అనుకుంటున్నారా. అవును మరి.. ఈ చిత్రం సాధించిన కొత్త రికార్డు థియేటర్స్‌లో కాదు. రీసెంట్‌గా టీవీలో ఈ సినిమాను ప్రదర్శించడం జరిగింది.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాడు బోయపాటి శ్రీను. సరైనోడు వంటి బ్లాక్‌బస్టర్ తరువాత బోయపాటి డైరెక్షన్‌లో ఈ సినిమా రావడంతో ‘‘జయ జానకి నాయక’’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు సరిపోయే విధంగా ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్‌తో అదరగొట్టాడు బోయపాటి. ఇక బాక్సాఫీస్ వద్ద యావరేజ్ సినిమాగా నిలిచిన ‘జయ జానకి నాయక’కు టీవీలో మాత్రం జనాలు బ్రహ్మరధం పట్టారు. గత వారాంతంలో ఈ సినిమా టీవీలో వచ్చినప్పుడు జనాలు ఈ సినిమాను ఎగబడి చూశారు. దీంతో ఈ సినిమా ప్రసారమయ్యే సమయంలో సదరు ఛానల్ టీఆర్‌పీ ఏకంగా 14.6గా నమోదయ్యింది. బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి హీరో స్థాయికి ఈ రేటింగ్ చాలా ఎక్కువ అని చెప్పాలి.

ఇక బోయపాటి డైరెక్షన్ వచ్చిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఏదేమైనా బుల్లితెరపై జయ జానకి నాయక చిత్రం దుమ్ములేపింది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.