డామిట్.. అడ్డం తిరిగిన ఆఫీసర్ ‘కథ’!

అసలే ‘ఆఫీసర్’ సినిమా ఎన్నో వివాదాల చుట్టూ నలిగిపోతోంది. శ్రీరెడ్డి వ్యవహారంలో వర్మ తలదూర్చడంతో జనాల నుంచి పూర్తి వ్యతిరేకత నెలకొనడం, ‘వైటీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్’తో లావాదేవీల వివాదం కారణంగా వాయిదా పడటం.. వంటి ఇష్యూలతో ఈ చిత్రం సతమతవుతోంది. ఇది చాలదన్నట్లుగా లేటెస్ట్‌గా మరో వివాదం తలమీదొచ్చి పడింది.

ఈ సినిమా కథ తనదేనని రచయిత జయకుమార్ బాంబ్ పేల్చాడు. తన కథను తీసుకున్న వర్మ.. కంపెన్సేషన్‌తోపాటు క్రెడిట్ కూడా ఇస్తానని చెప్పాడని.. కానీ అలా చేయకుండా తనకు మోసం చేశాడని ఆ రైటర్ ఆరోపించాడు. ఈ మేరకు మీడియాకు ఓ లేఖ కూడా విడుదల చేశాడు. తాను వర్మపై న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు. ‘సర్కార్-3’ వివాదం చెలరేగడానికి ముందే తాను ‘ఆఫీసర్’ కథని వర్మకి మెయిల్ చేశానని.. మధ్యలో కొన్ని మార్పులు కూడా చేసి మళ్ళీ పంపించానని వెల్లడించాడు. ‘ఆఫీసర్’ ప్రొడక్షన్ టైంలో తనకు కంపెన్సేషన్ క్రెడిట్ ఇస్తానని వర్మ హామీ ఇచ్చాడని.. కానీ ఆ మాట అతను తప్పాడని జయకుమార్ పేర్కొన్నాడు.

తన కథను కాపీ కొట్టడంతోపాటు క్రెడిట్ కూడా ఇవ్వకపోవడం బాధాకరమన్నాడు. అనుమతి లేకుండా తన హక్కులను వర్మ ఉల్లంఘించాడని.. తన సినీ భవిష్యత్తును వర్మ దెబ్బతీశాడని.. ఈ వివాదంలో తనకు ఇండస్ట్రీ పెద్దలందరూ న్యాయం చేయాలని కోరాడు. కాగా.. ‘సర్కార్-3’ కథ విషయంలోనూ ఈ ఇద్దరి మధ్య ఇలాగే గొడవ జరిగింది. ఇప్పుడు ఆ కేసు హైదరాబాద్ కోర్టు పరిధిలో ఉంది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.