25 లక్షల లోన్ కావాలా.. అయితే అర్హత తెలుసుకోండి!

job opputurnities for youth

ఉద్యోగాలు లేక విలవిలలాడుతున్న నిరుద్యోగులకు పండగలాంటి వార్త! ‘ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పథకం’ స్వయం ఉపాధిపై యువతకు భరోసా కల్పిస్తుంది. 2008లో ప్రధానమంత్రి రోజ్‌గారి యోజన, గ్రామీణ ఉపాధి కల్పన రెండింటిని కలిపి పీఎంఈజీపిగా మార్చటం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం.. గ్రామీణ, పట్టణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే! ఈ పథకాన్ని ఎంఎన్‌ఎంఈ మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ ద్వారా అమలు చేస్తుంది. 2017-18 సంవత్సరంలో ఉమ్మడిలో ఒక్కో జిల్లాకు 608 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అర్హత గల ప్రాజెక్టులు : ఈ పథకం ద్వారా అన్ని రకాల నూతన గ్రామీణ పరిశ్రమలు, స్వయం ఉపాధి పథకాలు లబ్ధి పొందటానికి అర్హత కలిగి ఉంటాయి. ఉత్పత్తి పరిశ్రమ ప్రాజెక్టులకు గరిష్ట పరిమితి రూ. 25 లక్షలు కాగా.. సర్విస్‌ పరిశ్రమలకు రూ. 10 లక్షలుగా ప్రాజెక్టు వ్యయంగా నిర్ణయించారు. అయితే.. ముందే స్థాపించిన యూనిట్లకు ఈ పథకం ద్వారా లబ్ధిపొందటానికి అనర్హులు.

బ్యాంకులు : పబ్లిక్‌ సెక్టార్‌, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సిబ్డి, ఐఎన్‌జీ వైశ్యాబ్యాంకు, కరూర్‌ వైశ్యాబ్యాంకు, కర్ణాటక బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ధనలక్ష్మి బ్యాంకు లిమిటెడ్‌, లక్ష్మి విలాస్‌ బ్యాంకు లిమిటెడ్‌, సౌత్‌ ఇండియా బ్యాంకు లిమిటెడ్‌, ఫెడరల్‌ బ్యాంకు లిమిటెడ్‌, కృష్ణభీమా మామృదేశీ లోకల్‌ ఏరియా బ్యాంకు, హెడ్‌డిఎఫ్‌సీ బ్యాంకు లిమిటెడ్‌, తమిళనాడు మర్కన్‌టైల్‌ బ్యాంకు, డిస్ట్రిక్ట్‌ సెంట్రల్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకు.. తదితర బ్యాంకులు లోన్స్ ఇస్తాయి.

సబ్సిడీ వివరాలు : పీఎంఈజీపీలో లబ్ధిదారులు సాధారణ విభాగం లబ్ధిదారుని పెట్టుబడి 10 శాతం, సబ్సిడీ పట్టణ ప్రాంతంలో 15 శాతం, గ్రామీణ ప్రాంతంలో 25 శాతం ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగులు, మాజీ సైనికులకు చెందిన లబ్ధిదారుని పెట్టుబడిగా 5 శాతం, సబ్సిడీ పట్టణ ప్రాంతంలో 25 శాతం, గ్రామీణ ప్రాంతంలో 35 శాతం ఉంటుంది.

దరఖాస్తులు చేసుకునే విధానం : ఈ పథకానికి దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు www.kviconline.gov.in క్లిక్‌ చేసి పీఎంఈజీపి ఇ.పోర్టల్‌లోకి వెళ్లాలి. అనంతరం దరఖాస్తు ఫారాన్ని ఎంపిక చేసుకోవాలి. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులైతే కేవీఐసీ, పట్టణ నిరుద్యోగులైతే డీఐసీలో వివరాలను నమోదు చేయాలి.

అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు :
* 18 ఏళ్లు నిండిన యువకులు అర్హులు. పీఎంఈజీపీలో ప్రాజెక్టులు స్థాపించుటకు ఎటువంటి ఆదాయ పరిమితి లేదు.
* రూ.10 లక్షలకు మించిన ఉత్పత్తి పరిశ్రమలకు, రూ.5 లక్షలకు మించిన సేవా పరిశ్రమలకు అభ్యర్థులు కనీస విద్యార్హత 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
* పీఎంఈజీపీ పథకంలో కేవలం నూతనంగా నెలకొల్పబడే ప్రాజెక్టులకు మాత్రమే అర్హత కలదు.
* స్వయం సహాయక బృందాలు, ధారిద్ర రేఖకు దిగువన ఉన్న ఎస్‌ఎస్‌జీలు, వేరే ఇతర పథకాల ద్వారా లబ్ధిపొందని వారు అర్హులు.
* 1860 యాక్ట్‌ కింద రిజిష్టర్‌ అయిన సొసైటీలు, సహకార సంఘాలు, సచ్చంద సంస్థలు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.