వీడిన మిస్టరీ.. తారక్ బయటపెట్టని ఆ ఇద్దరు ఆప్తులు వీళ్లే!

Jr NTR Jai Lava Kusa Story Best Friends Names Going Viral
Tellmeboss.net

‘జై లవ కుశ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అద్భుతమైన ప్రసంగం ఇచ్చిన తారక్.. మధ్యలో ఓ మిస్టరీతో అందరి మైండ్స్‌ని బ్లాక్ చేసేశాడు. అదేంటంటే.. బాబీ తనకు ఈ కథ చెప్పిన మొదట్లో తాను సినిమా చేయగలనా? లేదా? అని భయపడిపోయానని, అనంతరం ఇద్దరు ఆప్తులతో కథ షేర్ చేసుకున్నాక వాళ్లు బాగుందని అన్నారని, సినిమా చేయమని సలహా వాళ్లు ఇచ్చారని తెలిపాడు. కానీ.. వారి పేర్లను మాత్రం బయటపెట్టలేదు. సినిమా సూపర్‌హిట్ అయ్యాక ఆ ఇద్దరి పేర్లను రివీల్ చేస్తానని, అప్పటివరకు చెప్పనని చెప్పాడు.

Tellmeboss.net

అంతే.. అప్పటినుంచి ఆ ఇద్దరు ఆప్తులెవరా? అని జనాలు ఆరాతీయడం మొదలుపెట్టారు. అటు ఇండస్ట్రీలోనూ ఈ విషయంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుండగా.. ఇటు సోషల్ మీడియాలోనూ నెటిజన్లు పెద్ద చర్చకే తెరలేపారు. ఇంతవరకూ దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు కానీ.. నెటిజన్లు మాత్రం ఆ ఇద్దరు వీళ్లే అయివుంటారని ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇంతకీ ఎవరని అనుకుంటున్నారా? మరెవ్వరో కాదు.. ఒకరు దర్శకుధీరుడు రాజమౌళి, మరొకరు కింగ్ నాగార్జున. తారక్ తన ప్రసంగంలో బయటపెట్టని ఆ ఇద్దరు ఆప్తులు వీళ్లేనని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. మరి.. నెటిజన్లు వేసిన అంచనా కరెక్టేనా? లేదా తారక్ మిస్టరీగా ఉంచిన ఆ ఇద్దరూ వేరేవాళ్లా? అనేది తెలియాలంటే.. వెయిట్ చేయాల్సిందే.

ఇదిలావుండగా.. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ నిర్మించిన ‘జై లవ కుశ’ భారీ అంచనాల మధ్య ఈనెల 21వ తేదీన రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇందులో తారక్ తన కెరీర్‌లో తొలిసారి త్రిపాత్రాభినయం పోషించగా.. నివేదా, రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటించారు.

Image result for nagarjuna ss rajamouli

Tellmeboss.net
Related posts:
బాహుబ‌లి చూసిన లోకేష్‌....రాజ‌మౌళి టీం పై చిన‌బాబు కామెంట్‌
మ‌హేష్ ఇంట్లో దీపావ‌ళి గిఫ్ట్‌!!
‘ఏంటి.. నేను ఇలా మాట్లాడానా?’.. ఆ కామెంట్లపై కోదండరామిరెడ్డి రియాక్షన్
రేష్మికి ఊహించని షాక్.. కేసు పెట్టిన దర్శకుడు..
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై మండిపడ్డ యాంకర్ ఝాన్సీ
దువ్వాడ జగన్నాధమ్ క్లోజింగ్ కలెక్షన్స్.. బయ్యర్లకు నామం!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.