ఆ డైరెక్టర్‌తో తారక్ ‘19’ ప్లాన్.. ‘అదిరింది’!

కెరీర్ పరంగా నటరుద్ర ఎన్టీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎంత ఇంప్రెసివ్‌గా ఉంటున్నాయో అందరికీ తెలుసు! ఒకప్పుడు సరైన హిట్ లేక సతమతమైన ఈ హీరో.. ‘టెంపర్’ నుంచి ఆచితూచి అడుగులు వేస్తూ తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు. ఇక ‘జై లవకుశ’ని సింగిల్ హ్యాండ్‌గా మెయింటెయిన్ చేసి.. తన అసలైన స్టామినా చాటిచెప్పాడు. ఇప్పుడు అది రెట్టింపయ్యే రేంజులో వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాడు తారక్!

అఫ్‌కోర్స్.. త్రివిక్రమ్‌తో ప్రస్తుతం, ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్‌లో చరణ్‌తో మల్టీస్టారర్ చేస్తున్న ప్రాజెక్ట్ వివరాలు ఇదివరకు తెలిసిందే! ఇవి కాకుండా మరో ప్రాజెక్ట్ కోసం ఓ బ్లాక్‌బస్టర్ దర్శకుడితో చేతులు కలిపాడు. ఇంతకీ అతనెవరనుకుంటున్నారు? మరెవ్వరో కాదు.. గతేడాది తమిళనాడులో 200+ కోట్ల గ్రాస్‌తో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘మెర్శల్’ దర్శకుడు అట్లీ! ఎస్.. మీరు చదువుతోంది అక్షరాల నిజం! తెలుగులోనూ ఆరంగేట్రం చేయాలనుకుంటున్న ఆ దర్శకుడు.. ఇప్పటికే చాలామంది హీరోలతో చర్చలు జరిపాడు. ఈ నేపథ్యంలోనే తారక్‌తోనూ సంప్రదింపులు జరిపి, ఓ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ వేయించుకున్నాడని సమాచారం. ఈ వ్యవహారమంతా రీసెంట్‌గానే జరిగిందట!

తన రెండు ప్రాజెక్టులు ముగిసిపోయిన తర్వాత.. తనతో పక్కాగా సినిమా చేస్తానని అట్లీకి తారక్ మాటిచ్చినట్లు తెలుస్తోంది. ప్రెజెంట్ త్రివిక్రమ్‌తో చేస్తున్న ప్రాజెక్ట్ ఈ ఇయర్‌లోనే కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత జక్కన్నతో చేయనున్న ప్రాజెక్ట్ 2019 ద్వితీయార్థంలో కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాతే ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ మీదకు తీసుకెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్నారు. అట్లీ నేరుగా తెలుగులో సినిమా చేయకపోయినా.. అతని డబ్బింగ్ చిత్రాలు మాత్రం ఇక్కడ ఘనవిజయం సాధించాయి. అలాంటి దర్శకుడితో తారక్ చేతులు కలపడంతో.. ఇప్పట్నుంచే ఈ ప్రాజెక్ట్‌కి బోలెడంత క్రేజ్ వచ్చేసింది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.