హరితేజ వెనుక ఎన్టీఆర్ హ్యాండ్..?

Junior NTR Behind Hari Teja Jabardasth Offer

హరితేజ వెనుక ఎన్టీఆర్ హ్యాండ్ ఉండటం ఏంటి..? వీళ్లిద్దరూ చేతులు కలిపి మళ్ళీ ఏదైనా షో చేస్తున్నారా..? లేక మరే విషయంలోనైనా డీల్ కుదిరిందా..? ఇంతకీ అసలు మేటర్ ఏంటి..? అనే సందేహాలు వస్తున్నాయి కదూ! అక్కడికే వస్తున్నాం. కాకపోతే.. మీకు వస్తున్న సందేహాల్లో ఏ ఒక్కటి నిజం కాదు. అంతకుమించిన ట్విస్ట్ ఒకటుంది. అదేదో తెలియాలంటే.. మేటర్‌లోకి వెళ్లాల్సిందే!

హరితేజ ఇదివరకే సీరియల్స్‌లో నటించింది.. కొన్ని షోలకు యాంకరింగ్ చేసింది కూడా! కాకపోతే అప్పట్లో ఆమెకి అంత క్రేజ్ లేదు. అయితే దర్శకుడు త్రివిక్రమ్ తన ‘అ.. ఆ’ సినిమాలో ఒక మంచి పాత్ర ఇచ్చి హైలైట్ చేశాడు. దాంతో ఆమెకి మంచి పేరొచ్చింది. సరిగ్గా ఇదే టైంలో ‘బిగ్‌బాస్’ షో ఆఫర్ వచ్చింది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా.. ఆ అవకాశాన్ని హరితేజ పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. తన సత్తా చాటుకోవడానికి అదే మంచి ఛాన్స్ అని భావించి.. తన టాలెంట్ ఏంటో చూపించింది. ఎంతో యాక్టివ్‌గా వుంటూ తన చలాకీతనంతో ఎంటర్టైన్ చేసి, బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. దీంతో ఆమెకి ఎనలేని క్రేజ్ వచ్చేసింది. ఫలితంగా ఆ నటికి సినిమాల్లోనే కాకుండా టివి రంగం నుంచి కూడా ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే హరితేజపై ఓ ప్రచారం ఊపందుకుంది. రష్మీ స్థానంలో జబర్దస్త్ షోకి యాంకర్‌గా ఆమెకి మల్లెమాల వారు ఆఫర్ ఇచ్చారన్నదే ఆ రూమర్ సారాంశం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రాలేదు కానీ.. దాదాపు అది నిజమేనని ఫిల్మ్‌నగర్‌లో చెప్పుకుంటున్నారు. దిమ్మతిరిగే ట్విస్ట్ ఏమిటంటే.. హరితేజకి ఈ ఆఫర్ రావడం వెనుక ఎన్టీఆర్ హ్యాండ్ వుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ‘బిగ్‌బాస్ హౌస్’లో ఆమె ప్రదర్శించిన ట్యాలెంట్‌కి ఫిదా అయిపోయిన తారక్.. వెనుకుండి ఆమెకి ఛాన్సులు ఇప్పిస్తున్నాడని ప్రచారం ఊపందుకుంది. ‘జబర్దస్త్’తో మరిన్ని ఆఫర్లు రావడం వెనుక తారక్ హస్తమే వుందని చెప్పుకుంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే.. వెయిట్ చేయాల్సిందే!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.