ఆలూలేదు చూలూలేదు.. అంతా బుస్సే!

Tellmeboss.net

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్న తన 28వ చిత్రం ప్రారంభోత్సవం తర్వాత నటరుద్ర ఎన్టీఆర్ బయట ఎక్కడా కనిపించలేదు. దీంతో.. తారక్ బరువు తగ్గే పనిలో బిజీ అయిపోయాడని ప్రచారం జోరందుకుంది.

‘జై లవకుశ’ కోసం కాస్త బరువు పెరిగిని తారక్.. త్రివిక్రమ్ డిజైన్ చేసిన క్యారెక్టరైజేషన్ కోసం సన్నగా తయారయ్యేందుకు కసరత్తులు చేస్తున్నాడని, ఇందుకు బాలీవుడ్ ట్రెయినర్ లాయిడ్ స్టీవెన్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నట్లు పుకార్లు చక్కర్లు కొట్టాయి. సంక్రాంతి సందర్భంగా అతనితో కలిసి ఉన్న ఫోటో కూడా ఒకటి బయటికి రావడంతో.. తారక్ నిజంగానే బరువు తగ్గే పనిలో నిమగ్నమై ఉన్నాడని అనుకున్నారు. కానీ.. స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించడానికి వచ్చిన ఎన్టీఆర్‌ని చూశాక దెబ్బకు అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి.

Tellmeboss.net

ఎందుకంటే.. ఇన్నాళ్లూ ప్రచారం జరిగినట్లుగా తారక్ ఏమాత్రం సన్నబడలేదు. కాసింత మార్పు కూడా కనిపించలేదు. ‘జై లవకుశ’ షూటింగ్ టైంలో ఏ లుక్‌లో ఉన్నాడో.. అదే లుక్‌లో దర్శనమిచ్చాడు. ఈ దెబ్బతో తారక్ బరువు తగ్గుతున్నాడనే వార్తలు బోగస్ అని తేలిపోయింది. సినిమా సినిమాకి కొత్త లుక్‌లో కనిపించే తారక్.. ఈసారి రొటీన్ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు. త్రివిక్రమ్ ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలీక తలమునకలైపోతున్నారు.

Tellmeboss.net
Related posts:
కన్నకూతురినే 8మంది పిల్లలకు తల్లిని చేసిన నరరూప రాక్షసుడు
ఎయిర్‌లిఫ్ట్ హీరోకు ఎయిర్‌పోర్టులో అవమానం
బార్ డాన్సర్‌లా బట్టలు విప్పుతూ రెచ్చిపోయిన టీచర్.. సంచలనం రేపుతున్న వీడియో
చైనా పోలీసులకు చుక్కలు చూపించిన బుడతడు (వీడియో)
బెగ్గర్ సింగ్ కావద్దంటూ గబ్బర్‌కు ట్వీటిన వర్మ
పవన్‌కి ‘గుండు’ కొట్టించింది ఎవరో నాకు తెలుసు : రోజా

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.