‘భరత్ అనే నేను’పై తారక్ ‘మంత్రాలు’

‘భరత్ అనే నేను’ చిత్రం అంచనాలకు తగ్గట్టుగా ఆకట్టుకోవడంతో యావత్ తెలుగు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. సినీ సెలబ్రిటీలు కూడా ఈ మూవీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తొలిరోజే చూసిన దర్శకధీరుడు రాజమౌళి ఈ మూవీని ఆకాశానికెత్తేశారు. సినిమా అద్భుతంగా వుందని.. ఇందులో ఎన్నో బ్రహ్మాండమైన ఎలిమెంట్స్ వున్నాయని.. అందులో ప్రెస్‌మీట్ సన్నివేశం పీక్స్ అంటూ ప్రశంసించారు. అలాగే.. ‘లోకల్ గవర్నెన్స్’ ఆలోచనకు హ్యాట్సాఫ్ అంటూ కితాబిచ్చాడు. తాజాగా తారక్ ఈ మూవీని తనదైన స్టైల్‌లో కొనియాడాడు.

‘‘సామాజిక బాధ్యతలతో కమర్షియల్ ఎలిమెంట్స్‌ని కలపడం అంతా సులువైన పని కాదు. ఆ రెండింటిని బ్యూటిఫుల్‌గా బ్యాలెన్స్ చేసిన దర్శకుడు కొరటాల శివకి హ్యాట్సాఫ్. ఎక్కడా వంక పెట్టడానికి వీలులేకుండా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ డెలివర్ చేసిన మహేష్‌బాబుకి అభినందనలు. ఇక ఇలాంటి విశేషమైన, నిజాయితీగల సినిమాని రూపొందించినందుకు ‘భరత్ అనే నేను’కి కంగ్రాట్స్’’ అంటూ తారక్ ఈ చిత్రంపై పొగడ్తల వర్షం కురిపించేశాడు. ఆల్రెడీ తారక్ ‘భరత్ బహిరంగ సభ’కి విచ్చేసి.. ఈ మూవీకి కొంచెం క్రేజ్ తెచ్చిపెట్టాడు. ఇప్పుడీ ఈ ట్వీట్‌తో అతని ఫ్యాన్స్ మరింత స్ఫూర్తి పొంది.. ఈ మూవీ చూసేందుకు ప్రభావం చూపుతుందని చెప్పుకోవచ్చు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.