తట్టుకోలేని తారక్.. బయట పెట్టేసిన మాట!

junior ntr says tamanna is hot actress
Tellmeboss.net

నటరుద్ర ఎన్టీఆర్ ఈ మాట ఎన్నాళ్లనుంచి తన మనసులో దాచుకున్నాడో తెలీదు కానీ.. ఎట్టకేలకు దాన్ని బయటపెట్టేశాడు. రాకరాక వచ్చిన సందర్భాన్ని ఏమాత్రం వదులుకోకుండా సద్వినియోగం చేసుకున్నాడు. ఇంతకీ అతను చెప్పిన ఆ మాటేంటి? అని అనుకుంటున్నారా! ఆ వివరాలు తెలియాలంటే మేటర్‌లోకి వెళ్ళాల్సిందే.

Tellmeboss.net

రీసెంట్‌గా ఓ ప్రముఖ టివి ఛానెల్‌కి ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో భాగంగా యాంకర్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో కొన్ని ప్రశ్నలు సంధించింది. ఈ క్రమంలో ‘మీకు హాట్‌గా అనిపించిన హీరోయిన్ ఎవరు’ అని ప్రశ్న వేయగానే.. ‘వామ్మో’ అంటూ కళ్లప్పగించాడు తారక్. ఆ తర్వత తేరుకుని వెంటనే ‘తమన్నా’ అని వెంటనే సమాధానమిచ్చాడు. నిజానికి హీరోలెవ్వరూ తమ తోటి హీరోయిన్ల గురించి హాట్, సెక్సీ అని చెప్పరు. ఎంతసేపటికీ ‘చాలా మంచి నటి, బాగా యాక్ట్ చేస్తుంది’ అని చెప్తారే కానీ.. డేర్ చేసి ఎవ్వరూ ఫలానా నటి హాట్ అంటూ చెప్పరు.

కానీ.. తారక్ ఎలాంటి బిడియం లేకుండా తమన్నా చాలా హాట్ అంటూ చెప్పుకొచ్చాడు. ఎన్నాళ్లనుంచి దీన్ని మనసులో దాచిపెట్టుకున్నాడో తెలీదు కానీ.. ఛాన్స్ రావడంతో తట్టుకోలేక చెప్పేశాడు. దీంతో.. తారక్‌లో ఈ చిలిపి కోణం కూడా దాగి వుంటే అని ఇండస్ట్రీలో సరదా కామెంట్లు చేసుకుంటున్నారు.

Tellmeboss.net
Related posts:
మెగా ఫ్యాన్స్‌కు షాక్!!..ట‌్విట్ట‌ర్ ద్వారా చెప్పాడు
నా పేరు క‌రెక్టుగా ప‌ల‌కండి : శృతీహాస‌న్‌
ఇరవై నిమిషాలకే కోటిన్నర.. శృతి హాసన్ ఏమి చేసిందో తెలుసా ?
టీజర్ టాక్ : ‘అరకు రోడ్డు’ చాలా థ్రిల్లింగ్‌గా ఉంది!
‘ఊపిరి’ చిత్రానికి సెన్సార్ ఇచ్చిన రివ్యూ ఇదే!
కుటుంబ పరువును బజారుకీడ్చిన పూర్ణ ‘లిప్‌లాక్’ సీన్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.