ఇంకా పూర్తి కాలేదంటూ బాంబ్ పేల్చిన తారక్

తన 28వ చిత్రం కోసం నటరుద్ర ఎన్టీఆర్ కొత్త లుక్ ట్రై చేస్తున్నాడనే వార్త వచ్చినప్పటి నుంచి.. అందుకు సంబంధించి ఒక్క ఫోటో అయినా లీక్ అవ్వదా? అంటూ ఫ్యాన్స్‌తోపాటు జనాలు వెయిట్ చేస్తూ వచ్చారు. చివరికి ఆ సమయం రానే వచ్చేసింది. రీసెంట్‌గానే తారక్ చాలా స్లిమ్‌గా తయారైన ఫోటో ఒకటి బయటికొచ్చింది. అంతేకాదు.. హెయిర్ స్టైల్ మార్చడంతోపాటు గెడ్డం కూడా పూర్తిగా ట్రిమ్ చేయించి.. పూర్తి లవర్‌బాయ్‌గా దర్శనమిచ్చాడు. దీంతో.. తారక్ కొత్త లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడం మొదలెట్టారు.

కానీ.. ఇంతలోనే తారక్‌కి ట్రెయినింగ్ ఇస్తున్న ప్రముఖ బాలీవుడ్ ట్రెయినర్ లాయిడ్ స్టీవెన్స్ ఒక బాంబ్ పేల్చాడు. తారక్ తలక్రిందులుగా కసరత్తు చేస్తున్న వీడియో ఒకటి రిలీజ్ చేసి.. ‘ఇంకా పూర్తి కాలేదు’ అంటూ పోస్ట్ చేశాడు. అంటే.. తారక్ మరింత స్లిమ్‌గానూ, ఫిట్‌నెస్‌గా కనిపించ బోతున్నాడన్నది అతని సారాంశం. లేటెస్ట్‌గా బయటకొచ్చిన ఫోటోల్లోనే సూపర్బ్‌గా అనిపించిన తారక్.. ఇప్పుడు టోటల్ మేకోవర్‌లో ఇంకెలా ఉండబోతాడో ఊహిస్తేనే రొమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. సో ఆడియెన్స్.. గెట్ రెడీ ఫర్ గూస్‌బంప్స్ మూమెంట్!

ఇకపోతే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందబోయే ఈ చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వుండనుంది. ఇందులో తారక్ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడు. ఈ నెల్లోనే సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈ చిత్రాన్ని వీలైతే దసరాకో, కుదరకపోతే సంక్రాంతికో బరిలోకి దింపాలని యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Related posts:
వినాయక్ డైరెక్ష‌న్‌లో సీఎం చంద్ర‌బాబు...థ‌మ‌న్ మ్యూజిక్‌
పేషెంట్లకు బూతు సినిమాలు చూపిస్తున్న డాక్టర్లు!
తండ్రి పాటలకు స్టెప్పులేసిన కూతురు, అల్లుడు.. కనువిందుగా జరిగిన శ్రీజ మెహందీ ఫంక్షన్ (వీడియో)
పోలీసులకే షాకిచ్చిన సీక్రెట్ కాల్ గర్ల్స్ సెక్స్ రాకెట్..
ఆ నటుడికి అప్పుడే నిండిన నూరేళ్లు.. బీచ్‌లో తేలిన శవం
‘క్లూస్’ అంటూ టాప్ దర్శకుల పేర్లు బయటపెట్టిన శ్రీరెడ్డి

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.