టీజర్ టాక్: ‘విజేత’గా నిలిచిన మెగాఅల్లుడు

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! మొన్నీమధ్యే ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజవ్వగా.. దానికి పాజిటివ్ రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్‌గా ‘టీజర్’తో ఆకట్టుకున్నాడు కళ్యాణ్! నటనలో ఎలా రాణిస్తాడో అనే డౌట్స్‌కి చెక్ పెట్టి.. టైటిల్‌కి తగ్గట్టుగానే ‘విజేత’గా నిలిచాడు.

టీజర్ విషయానికొస్తే.. ముందుగా చెప్పినట్లుగానే ఇది తండ్రి-కొడుకు సెంటిమెంట్‌తో సాగే ఎమోషనల్ డ్రామా అని క్లారిటీ వచ్చేసింది. కొడుకుని మంచి పొజిషన్‌లో చూడాలని తండ్రి తాపత్రయం పడితే.. కొడుకు మాత్రం చలాకీగా తిరుగుతూ వివాదాల్లో చిక్కుకుంటుంటాడు. మధ్యలో ప్రేమ వ్యవహారం ఒకటి! ఈ అడ్డంకులన్నింటిని ఎదుర్కొని చివరికి కళ్యాణ్ విజేతగా ఎలా నిలిచాడన్నదే సినిమా! ఇది రొటీన్ స్టోరీనే అయినా.. టీజర్‌లో ప్రెజెంట్ చేసిన విధానం డిఫరెంట్‌గా ఉంది. ఈ టీజర్‌లో ‘మనస్సుకు నచ్చిన చేసుకుంటూ బ్రతకడం అందరికి సాధ్యం కాదు.. లైఫ్‌లో కొంచెం కాంప్రమైజ్ అయ్యి బ్రతకాలి’ అని మురళి శర్మ చెప్పిన డైలాగ్ హైలైట్!

కళ్యాణ్ లుక్స్ పరంగానే కాకుండా నటనపరంగానూ పరిణితి చూపించాడు. అక్కడక్కడ తేడా కొట్టొచ్చినట్లు అనిపించినా.. తొలిసినిమాకే అంత ప్రతిభ చూపడం గ్రేట్! ఇక మాళవిక శర్మ సింపుల్‌గా, బ్యూటిఫుల్ లుక్స్‌తో తళుక్కుమంది. మురళీ శర్మ ఎప్పట్లాగే తండ్రి పాత్రలో జీవించేశాడు. దర్శకుడు రాకేష్ శశి మంచి కథతో, సినిమాని బాగా తెరకెక్కించాడని ఈ టీజర్‌తో తెలిసిపోతుంది. దీనికి నేటిసినిమా ఇచ్చే రేటింగ్ : 3/5.

Related posts:
ఎన్టీఆర్ చేతిని క్యాండిల్‌తో కాల్చిన మంచుమనోజ్
అభిమానుల మధ్య చిచ్చపెట్టిన ఖైదీ, శాతకర్ణిల ప్రీ-రిలీజ్ బిజినెస్
రవితేజ విషయంలో బ్లండర్.. వాయించేస్తున్న ఫ్యాన్స్
‘గ్యాంగ్’ వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. డిజాస్టర్ రిపోర్ట్!
నాని రెమ్యునరేషన్.. మునుపటికంటే డబుల్
ట్రైలర్ టాక్ : పక్కా విలేజ్ డెడ్లీ పాలిటిక్స్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.