కళ్యాణ్, కాజల్‌ల ‘ఎమ్మెల్యే’ మూవీ రివ్యూ-రేటింగ్

చిత్రం : ఎమ్మెల్యే
నటీనటులు : కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్, రవికిషన్, వెన్నెల కిషోర్, తదితరులు
రచన-దర్శకత్వం : ఉపేంద్ర మాధవ్
నిర్మాత : కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, టిజి విశ్వప్రసాద్
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ళ
ఎడిటర్ : బిక్కిన తమ్మిరాజు
బ్యానర్ : బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్‌మెంట్స్
రిలీజ్ డేట్ : 23-03-2017

‘పటాస్’తో బ్లాక్‌బస్టర్ కొట్టిన కళ్యాణ్ రామ్ కెరీర్ ఊపందుకుంటుందనుకుంటే.. ‘షేర్’, ‘ఇజం’ వంటి డిజాస్టర్‌లతో మళ్ళీ గాడి తప్పింది. దీంతో.. కళ్యాణ్ కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చాడు. మంచి కథ కోసం వెయిట్ చేస్తూ వచ్చాడు. సరిగ్గా ఇదే టైంలో ఉపేంద్ర మాధవ్ ‘ఎమ్మెల్యే’ కథతో కళ్యాణ్ దగ్గరకు వెళ్ళాడు. అది నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. చకచకాల పనులు జరిగిపోవడం.. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇప్పటివరకు రిలీజైన ప్రోమోల్లో ఇదో కమర్షియల్ మూవీ అని తెలిసినా.. ఏదో కొత్తదనం వుంటుందనే ఆసక్తిని కూడా రేకెత్తించింది. మరి.. ఆ అంచనాల్ని ఈ చిత్రం అందుకుందా? కళ్యాణ్‌కి హిట్ ఇచ్చిందా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం పదండి..

కథ :
ఎలాంటి సమస్యలు లేకుండా కళ్యాణ్ రామ్ హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తుంటాడు. వెన్నెల కిషోర్‌తో కళ్యాణ్ సోదరి పెళ్ళయ్యాక.. వాళ్ళతో కలిసి అతను కూడా బెంగుళూరుకి వెళ్తాడు. అక్కడ ఇందు (కాజల్) అనే అమ్మాయిని చూసి.. ఫస్ట్ సైట్‌లోనే ప్రేమిస్తాడు. ఆమెని కూడా తన ప్రేమలో పడేసేందుకు హీరో నానాతంటాలు పడుతుంటాడు. ఈ క్రమంలోనే కళ్యాణ్‌కి ఇందు ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది.

దీంతో.. అతను రంగంలోకి దిగి.. రవికిషన్‌కి పోటీగా ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తాడు. అలాగే.. ఆ ఊళ్ళో మంచి పనులు కూడా చేస్తాడు. ఇంతకీ ఇందు ఫ్లాష్‌బ్యాక్ ఏంటి..? అసలు కళ్యాణ్ ఎందుకు రవికిషన్‌కి పోటీగా ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తాడు? ఇందుకి, రవికిషన్‌కి ఏమైనా సంబంధం వుందా..? ఇందు ప్రేమని కళ్యాణ్ గెలుచుకున్నాడా? చివరికి అతను ఎమ్మెల్యే అవుతాడా? అనే అంశాలతో ఈ మూవీ సాగుతుంది.

విశ్లేషణ :
అందరూ అనుకున్నట్లుగానే ఇది రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్. కథలో కొత్తదనం ఏమీ లేదు. అదే లవ్ స్టోరీ.. ప్రియురాలి కోసం విలన్లతో హీరో గొడవ.. ఇలా పాత చింతకాయ పచ్చడి అంశాలతోనే మూవీ సాగుతుంది. అలాగని ఇందులో మేటర్ లేదని కాదండోయ్.. ఎక్కడ బోర్ కొట్టకుండా ఈ మూవీ ఎంటర్టైన్ చేస్తుంది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు అన్ని అంశాల్ని సముపాళ్ళలో జోడించి.. దర్శకుడు చక్కగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. లవ్ ట్రాక్‌ని కాస్త కొత్తగా ప్రెజెంట్ చేశాడు.. కామెడీతో ఫుల్లుగా నవ్వించేశాడు.. కళ్యాణ్ చేత పొలిటికల్ డైలాగులు చెప్పించి ఊపు తెప్పించాడు.. రొటీన్ కమర్షియాలిటీలోనూ ప్రత్యేక కిక్ ఇచ్చాడు.. ఓవరాల్‌గా ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేశాడు.

ఫస్టాఫ్ మొత్తం చాలావరకు ఫన్‌గానే సాగుతుంది. హీరో, వెన్నెల కిషోర్ మధ్య ఫన్ ట్రాక్.. కాజల్‌తో రొమాంటిక్ ట్రాక్.. అంతా సరదాగా సాగుతాయి. వీటిని కాస్త డిఫరెంట్‌గా ప్రెజెండ్ చేయడం ఆకర్షణీయం. ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్‌తో కథ మరో మలుపు తిరుగుతుంది. సెకండాఫ్ మొత్తం సీరియస్‌గా సాగదీయకుండా.. కామెడీ మిక్స్ చేసి మాంచి మాస్ మసాలా ఒడ్డించాడు దర్శకుడు. విలన్‌తోనూ కామెడీ చేయించి.. బాగా నవ్వించాడు. హీరో-విలన్ మధ్య నడిచే ఎపిసోడ్స్ హిలేరియస్‌గానూ, ఉర్రూతలూగించేలాగానూ వున్నాయి. మరో హైలైట్ ఏంటంటే.. ఫస్టాఫ్‌కి ఏమాత్రం తగ్గకుండా సెకండాఫ్‌లోనూ కామెడీ పండించడమే! సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ మోడ్‌లో నడిపించి.. ప్రేక్షకులకు ఫన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్.

ఇకపోతే.. మాస్ ఆడియెన్స్ తగ్గట్టు ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. అలాగే.. కళ్యాణ్ చెప్పే డైలాగ్స్ కేక పెట్టించేస్తాయి. తనలోనూ కామెడీ యాంగిల్‌తోనూ కళ్యాణ్ ఆకట్టుకున్నాడు. ప్రమోషన్స్‌లో చెప్పినట్లుగా కళ్యాణ్ నిజంగానే కొత్త క్యారెక్టర్‌తో అలరించాడు. ఓవరాల్‌గా చూస్తే.. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. కాకపోతే.. రొటీన్ కథ, ఊహించే సన్నివేశాలు ఉండటం వల్ల కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఇది పెద్దగా నొప్పకపోవచ్చు.

నటీనటుల ప్రతిభ :
ఇదివరకు చెప్పినట్లుగానే కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో ఇరగదీసేశాడు. తనలో మరో యాంగిల్ చూపించి.. ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. మాస్, క్లాస్, కామెడీ.. ఇలా అన్నింటిలోనూ తనదైన ముద్ర వేశాడు. ఇక కాజల్ ఎప్పట్లాగే తన పాత్ర పరిధి అలరించింది. గ్లామర్‌తో ఆడియెన్స్ గుండెలపై ఎటాక్ చేసింది. విలన్ క్యారెక్టర్‌లో రవి కిషన్ మరోసారి ఇంప్రెస్ చేశాడు. కాకపోతే.. లిప్ సింక్ సరిగ్గా లేకపోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. చాలా గ్యాప్ తర్వాత బ్రహ్మానందం తన కామెడీతో కితకితలు పెట్టించేశాడు. అలాగే.. వెన్నెల కిశోర్, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి ప్రేక్షకుల్ని నవ్వించడంలో సక్సెస్ అయ్యారు. ఇతర నటీనటులు మామూలే!

టెక్నికల్ పెర్ఫార్మెన్స్ :
ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ప్రతి ఫ్రేమ్‌ని చాలా గ్రాండ్‌గా చూపించారు. కళ్యాణ్‌ని కూడా స్టైలిష్‌గా, చాలా కొత్తగా ప్రెజెంట్ చేశారు. మణిశర్మ అందించిన పాటలు పెద్దగా కిక్ ఇవ్వలేకపోయాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం కుమ్మేశాడు. సినిమాలో డైలాగ్స్ అదిరిపోయాయి. కొన్ని ఆలోచింపచేస్తాయి. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్స్ ఓకే. నిర్మాణ విలువలకు ఎక్కడా వంక పెట్టడానికి లేదు. ఇక దర్శకుడు ఉపేంద్ర ఎంచుకున్న స్టోరీ లైన్ రొటీన్ అయినప్పటికీ.. ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా బాగానే హ్యాండిల్ చేశాడు. మొదటి చిత్రమే అయినా.. తన సత్తా చాటుకున్నాడు. కాకపోతే కొంచెం కొత్తదనం జోడించే వుంటే బాగుండేది.

చివరగా : రొటీన్ అయినా బోర్ కొట్టించని కమర్షియల్ ఎంటర్టైనర్
రేటింగ్ : 3/5

Related posts:
అల్ల‌రోడి " జేమ్స్‌బాండ్ " సెన్సార్ రిపోర్ట్‌
సైఫ్ ఆలీఖాన్‌, క‌త్రీనాకైఫ్ ల ఫాంట‌మ్ రివ్యూ
‘గ్రేట్ మ్యారేజ్’కి మహేష్ భార్య ఇచ్చిన అద్భుత వివరణ
సొంతిల్లు వెనుక యంగ్ హీరో.. గుట్టు విప్పిన రకుల్ ప్రీత్
టచ్ చేసి చూడు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. డిజాస్టర్ కన్ఫర్మ్!
ఆరు వారాల్లో ‘రంగస్థలం’ మరో రీసౌండ్.. ఇదీ చరణ్ సత్తా!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.