కమల్‌హాసన్, పూజాకుమార్‌ల ‘విశ్వరూపం-2’ రివ్యూ-రేటింగ్

చిత్రం : ‘విశ్వరూపం-2’
నటీనటులు : కమల్ హాసన్, పూజా కుమార్, ఆండ్రియా జెరెమీ, వహీదా రెహ్మాన్, తదితరులు
రచన – దర్శకత్వం : కమల్ హాసన్
నిర్మాతలు: ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌హాసన్
మ్యూజిక్ : జిబ్రాన్
సినిమాటోగ్రఫీ : శ్యామ్ దత్ – సాను జాన్ వర్గీస్
ఎడిటర్ : మహేష్‌ నారాయణన్‌, విజయ్‌ శంకర్‌
బ్యానర్ : రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌
విడుదల తేదీ : 10-08-2018

‘విశ్వరూపం-2’.. ఐదున్నరేళ్ళ కిందట తన స్వీయ దర్శకత్వంలో కమల్‌హాసన్ తెరకెక్కించిన ‘విశ్వరూపం’కి ఇది సీక్వెల్! ఈ మూవీనీ తనే రాసి దర్శకత్వం వహించాడు కమల్‌! తొలి మూవీ మంచి విజయం సాధించడంతో.. ఈ సీక్వెల్ అంతకుమించి వుండొచ్చని జనాల్లో అంచనాలు పెరిగాయి. ప్రోమోలూ ఆసక్తికరంగా వుండటంతో.. ఖచ్చితంగా ఈ మూవీ తమ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అవుతుందని అభిప్రాయం ఏర్పడింది. మరి.. కమల్ ఈసారి కూడా గత మ్యాజిక్‌ని రిపీట్ చేయగలిగాడా? లేదా? రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ :
ఓ గూఢచారి అయిన విసామ్ అహ్మద్ కశ్మీరీ (కమల్ హాసన్)… అల్‌ఖైదా ఉగ్రవాదుల్లో చేరి, వారి వ్యూహాల్ని భారత సైన్యానికి అప్పగిస్తుంటాడు. అల్‌ఖైదా వేసే ప్రతి ప్లాన్‌ ఫెయిల్ అయ్యేలా చేస్తాడు. అయితే.. విసామ్ గురించి అల్‌ఖైదా ఉగ్రవాది ఒమర్ ఖురేషి (రాహుల్ బోస్)కి తెలిసిపోతుంది. విసామ్‌ని అంతమొందించాలని నిర్ణయించుకుంటాడు.

తన గురించి అల్‌ఖైదాకి తెలిసిపోయిందని పసిగట్టిన విసామ్.. వెంటనే లండన్‌కి వెళ్ళిపోతాడు. అక్కడ కూడా అతనిపై దాడులు జరుగుతాయి. అదే టైంలో లండన్ నగరాన్ని నాశనం చేసేందుకు అల్‌ఖైదా ఒక పెద్ద పథకం రచిస్తుంది. దాన్ని విసామ్ ఎలా నిర్వీర్యం చేశాడు? ఖురేషిని ఎలాంటి అంతం చేశాడు? అనేదే ఈ సినిమా కథ!

విశ్లేషణ :
రిలీజ్‌కి ముందు యూనిట్ చేసిన ప్రమోషన్స్, ప్రోమోలు రేకెత్తించిన ఆసక్తి చూసి.. ఈ మూవీ తొలిభాగం కంటే మరింత ఇంట్రెస్టింగ్‌గా, ట్విస్టుల మీద ట్విస్టులతో ఉత్కంఠభరితంగా సాగుతుందనే అంచనాలతోనే సినిమాకి వెళ్తాం! తీరా చూశాక.. దీనికోసమా ఇంత ఆరాటపడిందనే భావన కలుగుతుంది. అంతగా నిరాశపరుస్తుంది ఈ చిత్రం!

అసలు ఈ సినిమాలో కథే లేదు. ఫస్ట్ పార్ట్‌లోలాగే కమల్ కథ-కథనాల్ని బలంగా రాసుకోలేదు. ట్విస్టులు అంతకన్నా లేవు. కేవలం బాంబులు నిర్వీర్యం చేయాలనే టాస్కులతోనే ఈ చిత్రం సాగిపోతుంటుంది. మొదట్లో కాసేపు ఇంట్రెస్టింగ్‌గానే నడిచినా.. సరిగ్గా అరగంటయ్యాక కథ గాడి తప్పింది. అక్కడినుంచి సినిమా చాలా బోరింగ్‌గా నడుస్తుంది. ఎక్కడా ఆసక్తి రేకెత్తించగా.. చాలా భారంగా సాగుతుంది. అక్కడక్కడ గత సినిమా ఎపిసోడ్స్‌ని చూపిస్తున్నప్పుడు ఉత్సాహం వస్తుంది కానీ.. వర్తమానంలోకి వచ్చాక కథనం చాలా వీక్ అయిపోయింది. లండన్ సముద్రంలో హీరోకి ఇచ్చే టాస్క్ మొదట్లో ఉత్కంఠ రేకెత్తించినా.. చివర్లో దాన్ని మామూలుగా తేల్చేసి, ఉన్న ఆసక్తిని పోగొట్టేశారు.

కాకపోతే చివర్లో అరగంట సినిమా కొంచెం బాగానే నడిచింది. ప్రేక్షకుడు ఈ మూవీకి మరింత హైరేంజులో ముగింపు కోరుకుంటాడు. కానీ.. ఫస్ట్ నుంచి సినిమా సాగిన విధానంతో పోల్చితే ఈమాత్రం క్లైమాక్స్ అయిన కన్వీన్స్ చేయగలిగిందిలే అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే.. తొలి చిత్రానికి పూర్తి భిన్నంగా ఈ సీక్వెల్‌ని రూపొందించి, కమల్ చాలా డిజప్పాయింట్ చేసేశాడు.

నటీనటుల ప్రతిభ :
కమల్ హాసన్ తన సహజనటనతో ఆకట్టుకున్నారు కానీ.. తొలి పార్ట్‌లో చూపించిన వేరియేషన్స్‌తో పోలిస్తే ఈసారి ఆయన రోల్ తేలిపోయినట్లు అనిపిస్తుంది. పూజాకుమార్, ఆండ్రియాలు తమ తమ పాత్రల్లో బాగానే ఒదిగిపోయారు. రాహుల్ బోస్ ఉన్నంతలో కేక పుట్టించాడు కానీ, పెద్దగా స్కోప్ లేకపోవడంతో సినిమా మొత్తంలో తేలిపోయాడు. వహీదా రెహమాన్ బాగానే చేశారు. మిగతావాళ్ళు తమతమ పాత్రపరిధి బాగానే నటించారు.

సాంకేతిక పనితీరు :
కమల్ హాసన్ ఈసారి రచయితగానూ, దర్శకుడిగానూ ఫెయిల్ అయ్యాడు. కొన్ని చోట్ల ఓకే గానీ.. ఓవరాల్‌గా మాత్రం మెప్పించలేకపోయాడు. జిబ్రాన్ అందించిన పాటలు జస్ట్ ఓకే. నేపథ్యం సంగీతం మాత్రం బాగుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. శ్యామ్ దత్-సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహణం బాగుంది.

చివరగా : ఇది కమల్ ‘విశ్వరూపం’ కాదు.
రేటింగ్ : 1.5/5

Related posts:
రివ్యూ: ఈ కేరింత యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్
ప్రియమణితో ఆర్పీ పట్నాయక్‌ ద్విభాషా చిత్రం ‘ప్రతిక్షణం’
తెలుగువారికి షాకిచ్చిన బిచ్చగాడు.. కలెక్షన్స్ ఎంతో తెలుసా?
‘ఎన్టీఆర్ బయోపిక్’పై తారక్ రివర్స్ కౌంటర్.. బాలయ్య ఫ్యూజులు ఔట్!
‘భరతం’ పడుతున్న చిట్టిబాబు.. పాపం మహేష్!
ఆ పనికి పెళ్లి అవసరమా అంటున్న హీరోయిన్!!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.