కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ ఇంతేనా..?

తమిళనాడులో కమల్‌హాసన్‌కి ఎంత ఫాలోయింగ్ వుందో… అంతే క్రేజ్ తెలుగులోనూ వుంది. ఆయన చిత్రం విడుదల అవుతోందంటే చాలు.. అక్కడిలాగే ఇక్కడ కూడా పండగ వాతావరణం నెలకొంటుంది. ఒకరోజుముందే జనాలు థియేటర్ల వద్ద బారులు తీరుతారు. కానీ.. ఇప్పుడు సీన్ టోటల్‌గా మారిపోయింది. రెగ్యులర్‌గా భారీ సినిమాలు చేయకపోవడం, చేసిన చిన్నాచితకా చిత్రాలన్నీ నిరాశపరచడంతో.. టాలీవుడ్‌లో కమల్‌కి క్రేజ్‌తోపాటు మార్కెట్ వ్యాల్యూ కూడా బాగా పడిపోయింది. ఒక మీడియం రేంజ్ హీరోకంటే చాలా దారుణంగా డ్రాప్ అయ్యింది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం ‘విశ్వరూపం-2’ సినిమా బిజినెస్సే!

మొదట్లో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లిందని వార్త వచ్చినప్పుడు.. అప్పట్లో విపరీతమైన బజ్ ఏర్పడింది. తొలి పార్ట్‌తో కమల్ అంతగా విశ్వరూపం చూపకపోవడంతో.. రెండో పార్ట్‌తో అదరగొట్టేస్తాడనే అంచనాలు బాగా నెలకొన్నాయి. కానీ.. ఇది వరుసగా వాయిదాలు పడుతూ రావడం, మధ్యలో చేసిన మూవీలన్నీ బాగా డిజప్పాయింట్ చేయడంతో.. అప్పట్లో వున్నంత బజ్ ఇప్పుడీ ‘విశ్వరూపం-2’పై లేదు. అసలు ఈ సినిమా వస్తోందనే హడావుడి కూడా ఏమాత్రం లేదు. అందుకే.. బయ్యర్లు కూడా ఈ చిత్రాన్ని కొనేందుకు ముందుకు రాలేదు. దీంతో ఇది కమల్ కెరీర్‌లోనే అతి తక్కువ బిజినెస్ చేసింది. ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని ‘విశ్వరూపం-2’ కేవలం రూ.5.5 కోట్ల బిజినెస్ మాత్రమే చేయగలిగింది.

లోకనాయకుడు, నటనలో తిరుగులేని వాడు, సాహసోపేతమైన సినిమాలు తీయడంలో ధీశాలుడు, బాక్సాఫీస్‌ని చీల్చిచెండాడే భారతీయుడు అయినా కమల్.. ఈసారి తన విశ్వరూపం చాటుకోలేకపోవడం నిజంగా ఆశ్చర్యకరం! పోనీ రిలీజైన తర్వాతైన ఈ చిత్రం మంచి బిజినెస్ చేస్తుందేమో చూద్దాం!

Related posts:
నాగశౌర్య, మాళవిక, నందినీరెడ్డిల ‘కళ్యాణ వైభోగమే’ మూవీ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్
సమంత కెరీర్‌ని మలుపు తిప్పిన స్నేహితురాలి పుట్టినరోజు
హైటెక్ లేటెస్ట్ టెక్నాలజీతో టాలీవుడ్‌లో జీ-మిరాకిల్స్
‘హెలో’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. హాఫ్ సెంచరీ చేసిన అఖిల్
తారక్‌కి దేతడి.. చరణ్ ఫుల్ హ్యాపీ!
రైల్వే టీసీపై జబర్దస్త్ టీమ్ ఫైర్!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.