‘భరత్’కి కన్నడిగుల పంచ్.. దెబ్బకు మహేష్ పారాహుషార్

చాలాకాలం తర్వాత మంచి విజయం దక్కిందనే ఎగ్జైట్‌మెంట్‌లో హీరోలు అనుకోకుండా చిన్నచిన్న పొరపాట్లు చేస్తుంటారు. అవికూడా తామేమీ కావాలనే చేయరు.. జస్ట్ అలా జరిగిపోతుందంతే! కానీ.. వాటి పరిణామాలే చాలా తీవ్రంగా వుంటాయి. తమకు తెలియకుండా జరిగిపోయిన ఈ మిస్టేక్‌కి హీరోలు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. లేటెస్ట్‌గా మహేష్‌బాబు విషయంలోనూ అదే జరిగింది. కాకపోతే మహేష్ త్వరగా కోలుకోవడంతో.. ఆ సమస్య అక్కడికక్కడే సమసిపోయింది. ఇంతకీ ఏం జరిగిందనేగా మీ సందేహం..? అక్కడికే వస్తున్నాం!

‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్’ వంటి భారీ డిజాస్టర్ల తర్వాత ‘భరత్ అనే నేను’తో మహేష్ పెద్ద విజయం అందుకున్నాడు. ఆ రెండు చిత్రాలిచ్చిన షాక్ నుంచి ఈ మూవీ కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. దీంతో చాలా సంతోషంగా వున్న మహేష్.. తనకు మంచి విజయాన్నందించిన అభిమానులకు ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు చెప్పాడు. ఈ చిత్రం అన్ని రాష్ట్రాల్లోనూ హిట్ టాక్‌తో దూసుకుపోతుండడంతో.. తెలుగు వాళ్లతోపాటు, తమిళ, హిందీ, మలయాళ ప్రేక్షకులకు కూడా వాళ్ళ వాళ్ళ భాషల్లోనే మహేష్ కృతజ్ఞతలు చెప్పాడు. కానీ.. కన్నడిగులను మాత్రం మిస్సయిపోయాడు. ఇతర భాషా ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పినట్లుగా కన్నడిగులకు చెప్పడం మర్చిపోయాడు. దీంతో అక్కడి జనాలకు కోపం వచ్చేసింది. అంతే! వాళ్ళంతా మహేష్‌ని తగులుకున్నారు.

నిజానికి.. మన తెలుగు సినిమాలకు రెండు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అత్యధిక ఆదరణ లభించేది కర్ణాటకలోనే! అక్కడున్న తెలుగువాళ్ళే కాదు.. కన్నడిగులు సైతం మన చిత్రాలకు బ్రహ్మరథం పడతారు. అందుకే.. తెలుగు మూవీస్ అక్కడ బ్రహ్మాండమైన బిజినెస్ చేస్తాయి. అలాంటి తమను ఎలా మర్చిపోయాడంటూ మహేష్‌పై విమర్శలు గుప్పించారు కన్నడిగులు. తామంటే అంత చిన్నచూపా? అని ప్రశ్నించారు. తన పొరపాటుని గ్రహించిన మహేష్.. కన్నడిగులకు కృతజ్ఞతలు చెబుతూ ప్రత్యేకంగా మరో ట్వీట్ చేయడం విశేషం. దీంతో.. ఈ ఇష్యూ సెటిల్ అయ్యింది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.