కళ్యాణి లీక్స్ : శ్రీరెడ్డి బండారం బట్టబయలు

‘క్యాస్టింగ్ కౌచ్‌’పై తాను చేస్తున్న పోరాటాన్ని శాంతియుతంగా కొనసాగించకుండా.. అవనసరంగా పవన్ కళ్యాణ్‌ని సీన్‌లోకి తీసుకొచ్చింది శ్రీరెడ్డి! ఆయనపై బూతుపురాణం సంధించిడమే కాకుండా మిడిల్ ఫింగర్ చూపించింది. ఏమయ్యింది.. ఇన్నాళ్ళూ తాను సంపాదించుకున్న ఇమేజ్, కూడగట్టుకున్న మద్దతు మొత్తం బూడిదపాలయ్యింది. ఇతరులపై చల్లిన బురద ఇప్పుడు తనమీదకే వచ్చిపడుతోంది. శ్రీరెడ్డి లీక్స్ అంటూ తెగ డప్పు కొట్టిన ఈమెకి.. రివర్స్‌లో తనకే కౌంటర్లు పడుతున్నాయి. ఇప్పుడైతే.. కరాటే కళ్యాణి ఆమె గురించి మొత్తం బండారం బయటపెట్టింది. మళ్ళీ తలెత్తుకుని తిరిగే ప్రసక్తి లేకుండా చేసింది.

గతంలోనే కరాటే కళ్యాణి చాలాసార్లు శ్రీరెడ్డిని హెచ్చరించింది. ఇలా రాద్ధాంతంగా కాకుండా శాంతియుత మార్గాన్ని అనుసరించమని ఎంత చెప్పినా.. మీడియా అండగా వుంది కదా అనే పొగరుతో శ్రీరెడ్డి రెచ్చిపోయింది. అప్పట్నుంచి కళ్యాణి ఆమెపై పగపట్టింది. సరైన సమయం కోసం వేచి చూసిన కళ్యాణి.. ఇప్పుడు ఆ టైం వచ్చిందని భావించి తన విశ్వరూపం చూపించడం మొదలెట్టింది. కళ్యాణి లీక్స్ (truths) పేరుతో ఫేస్‌బుక్‌లో ఒక సంచలన పోస్ట్ పెట్టింది. ఇన్నాళ్ళూ బయట ప్రపంచానికి తెలియకుండా లోలోపలే దాచిన శ్రీరెడ్డి రహస్యాలన్నీ ఆ ఒక్క పోస్ట్‌తో బయటపడ్డాయి. ఆమె అసలు పేరు విమల అని.. పెళ్ళికాని ఆమెకి ఇంటర్ పూర్తి చేసుకున్న కూతురు కూడా వుందని షాకిచ్చింది. అసలు పేరెంట్స్ సంబంధాలు లేకున్నప్పుడు.. ఫ్లాట్ గృహప్రవేశానికి వాళ్ళ అమ్మ ఎందుకొచ్చిందని ప్రశ్న లేవనెత్తింది. అసలు ఖరీదైన కార్లలో తిరిగేంత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చిందంటూ చాలా రహస్యాలే బయటపెట్టింది కళ్యాణి!

‘‘కల్యాణి లీక్స్ ( truths) మొదలయ్యాయి అని భావించేవాళ్లకు.. ఈ pics.. పెళ్లి కాని విమలకు ఇంత పెద్ద కూతురు ఎక్కడినుండి వచ్చింది? విజయవాడ శ్రీ చైతన్యలో ఇంటర్ చదువుతోంది. మొన్ననే చదువు కూడా అక్కడ అయిపోయింది. విమల అమ్మతో 10 ఏళ్ళ నుండి సంభంధం లేకపోతే.. కొంత కాలం క్రిందట కూకట్ పల్లిలో లోథా మెరిడియన్‌లో కోటిన్నర విలువగల ప్లాట్‌లో ఇద్దరు ఎలా గృహప్రవేశం చేశారు.. ఖరీదైన కార్లలో తిరగడానికి కొనడానికి ఎలా వచ్చాయో డబ్బులు? ఏంటో… విమల నీకే తెలియాలి. మరి కొన్ని నాకు నచ్చినప్పుడు లీక్ చేస్తా…. నా లీక్స్ నా ఇష్టం’’ అంటూ కళ్యాణ్ పోస్ట్ పెట్టింది. మరి.. దీనిపై శ్రీరెడ్డి రియాక్షన్ ఎలా వుంటుందో చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.