HIV కంటే పవన్ కళ్యాణ్ చాలా డేంజర్.. అడ్డంగా నరికిన ‘కత్తి’

Kathi Mahesh Attack Pawan Kalyan

కత్తి మహేష్ ఆగడాలకి ఇప్పుడు హద్దూఅదుపు లేకుండా పోయింది. నిన్నటివరకు పవన్ కళ్యాణ్ సినీ, రాజకీయ ప్రస్థానాలపై విమర్శలు ఎక్కుపెట్టిన ఈ ‘బిగ్‌బాస్’ బెలూన్.. ఇప్పుడు వ్యక్తిగతంగా బాంబులు పేలుస్తున్నాడు. లేటెస్ట్‌గా పవన్ HIV కంటే చాలా డేంజర్ అంటూ ఫేస్‌బుక్ వేదికగా ఘాటు కామెంట్స్ చేశాడు. ఇంతలా కత్తి రెచ్చిపోవడానికి కారణం.. పవన్ ఫ్యాన్సే!

తమ అభిమాన హీరో అయిన పవన్‌ని టార్గెట్ చేస్తూ కత్తి మహేష్ నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడుతుండడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురై నేరుగా అతని ఫోన్‌కే మెసేజ్‌లు పెడుతున్నారు. పవన్ గురించి మాట్లాడితే చంపేస్తాం, నరికేస్తాం అంటూ వాట్సాప్‌లో వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఇంకొందరైతే బండబూతులు పంపారు. ఇలా వందల సంఖ్యలో కాదు.. వేలల్లో కత్తి మహేష్‌కి బూతుపురాణం సంధించారు. అది చూసి తట్టుకోలేకపోయిన కత్తి మహేష్.. వాళ్ల మెసేజ్‌లను షేర్ చేస్తూ.. పవన్ కళ్యాణ్‌పై దాడికి దిగాడు. అంతేకాదు.. ఫేస్‌బుక్‌లలో తనని పందితో పోల్చుతూ ‘మెమిస్’ చేస్తున్నారని, ఈ తతంగం అంతా ‘గీతా ఆర్ట్స్’ కాంపౌండ్‌లోనే నడుస్తోందంటూ ఏకంగా అల్లుఅరవింద్‌కే వార్నింగ్ ఇచ్చాడు. వాటిని ఆపకపోతే తాను రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించాడు.

‘‘కొన్ని ఫేస్‌బుక్ పేజీలు నన్ను పందితో పోల్చుతూ ‘మెమిస్’ చేస్తున్నారు. అవన్నీ ‘గీతా ఆర్ట్స్’ కాంపౌండ్‌లోనే జరుగుతోందని నాకు తెలిసింది. అల్లుఅరవింద్ దీనిపై యాక్షన్ తీసుకుని ఈ నాన్సెన్స్‌ని ఆపకపోతే.. నేను యాక్షన్‌లోకి దిగాల్సి వస్తుంది. నా ఫోన్ నెంబర్ కూడా ఆ ఆఫీస్ నుంచే ఫ్యాన్స్‌కి చేరింది. నేనేమీ అల్లుఅరవింద్, గీతా ఆర్ట్స్‌కి వ్యతిరేకిని కాను. కాబట్టి.. దయచేసి ఈ పైశాచికానందానికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని పోస్ట్ పెట్టాడు. ఆ వెంటనే.. ‘‘పీకే ఫ్యాన్స్ చేస్తున్న బూతులపై, ఇస్తున్న వార్నింగ్‌లకి వ్యతిరేకంగా కంప్లైంట్ లాడ్జ్ చేయమని నా ఫ్రెండ్స్ సలహా ఇస్తున్నారు. అందులో టీనేజ్‌వారే ఉండడం గమనార్హం’’ అంటూ పోస్ట్ చేశాడు. అందులోనే పీకేని టార్గెట్ చేస్తూ అక్కసు వెళ్లగక్కాడు.

‘‘పవన్ కళ్యాణ్ ఒక వైరస్‌లా మారాడు. ఒకవిధంగా చెప్పాలంటే పీకే హెఐవీ కంటే చాలా డేంజర్. అది ప్రస్తుత జనరేషన్‌కి సంబంధించిన యువకుల హేతుబద్ధమైన ప్రవర్తనని, పౌర భావనని తినేస్తోంది. ఈ పిచ్చితనం సామాజికంగా నయం చేయాలేగానీ దీనికి లీగల్‌గా సొల్యూషన్ ఉండదు’’ అంటూ కత్తి మహేష్ విరుచుకుపడ్డాడు. చూస్తుంటే.. కత్తి మహేష్ ఇప్పట్లో ఆగేలా లేడు. ఈ వ్యవహారానికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో వేచి చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.