మళ్లీ కెలుకుతున్న కత్తి.. చిరు మోసంపై కౌంటర్!

పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తే చాలు.. కత్తి మహేష్ ఉగ్రరూపం దాల్చుతాడు. భూమి నుంచి పైకి దూసుకొచ్చే లావాలాగా విమర్శలు ఎక్కుపెడుతాడు. ఈయనేదో గొప్ప పనులు చేసి సమాజసే చేసినట్లు బిల్డప్ ఇచ్చుకుంటూ.. పవన్ ప్రసంగాలపై వేలెత్తి చూపుతుంటాడు. ఏదేమైనా.. ఆయన చెప్పే విషయాల్లో ఆలోచించాల్సిన అంశాలుంటాయి కాబట్టి అవి ఇండస్ట్రీలో పెనుదుమారం రేపుతాయి. మధ్యలో కొన్నాళ్లు పవన్‌పై దండయాత్ర చేయడం ఆపేసిన కత్తి.. ఇప్పుడు మళ్ళీ తన నోటికి పదును పెట్టాడు. వైజాగ్‌లో పవన్ తన స్పీచ్‌ ఇస్తున్న టైంలోనే.. అందులోని తనక్కావాల్సిన సంచలనఅంశాల్ని వెతికి పట్టుకుంటూ.. వెంటనే బాంబులు పేల్చుతున్నాడు. అందులో ఇదొకటి!

పవన్ తన ప్రసంగంలో భాగంగా అన్నయ్య చిరంజీవిని, ఆయన స్థాపించిన పి.ఆర్.పి (ప్రజారాజ్యం పార్టీ)ని కొందరు మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందుకు కత్తి తనదైన శైలిలో సోషల్ మీడియా ద్వారా కౌంటర్ వేశాడు. ‘‘అన్నను, ‘పి.ఆర్.పి’ ని మోసం చేసినవాళ్ళ సంగతి సరే.. మరి అన్నగారు జనానికి, కులానికి, పార్టీకి చేసిన మోసం సంగతో!!’’ అంటూ చురకలంటించాడు. ఇక్కడ కత్తి ఉద్దేశం ఏంటంటే.. ‘‘చిరు పార్టీని స్థాపించి, జనాలకు ఎన్నో హామీలు ఇచ్చి.. చివరికి కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసి, సైలెంట్ అయిపోవడం మోసం కాదా?’’ అని తన అభిప్రాయాన్ని ఆ వ్యాఖ్య రూపంలో వెలిబుచ్చాడు. మరి.. దీనికి ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో వేచి చూడాలి.

Related posts:
శివ‌, రంగీలాను మించిన సినిమాలు తీస్తా..వ‌ర్మ‌కు ట‌్రైనింగ్ ఇస్తా!!
జమ్మూకాశ్మీర్ సీఎం కన్నుమూత.. తదుపరి ముఖ్యమంత్రిపై చర్చలు!
యాంకర్ నిరోషా సూసైడ్ కేసులో ఊహించని ట్విస్ట్..?
ఫ్లాష్‌ఫ్లాష్ : సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై కర్ణాటకలో కేసు.. కారణం ఇదే!
మోదీ నిర్ణయంపై నాని ‘బ్లాక్’బస్టర్ కామెంట్
పవన్‌కి అసలు ‘పవర్’ ఏంటో చూపిస్తా.. శ్రీరెడ్డి ఓపెన్ ఛాలెంజ్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.