‘గుడ్లు’ పెట్టిన చిచ్చు.. పవన్‌పై కేసు నమోదు!

Tellmeboss.net

ఇప్పటికే కత్తి మహేష్ సుత్తి వినలేక చస్తుంటే.. ఇప్పుడు ఈ కొత్త లొల్లి ఏంది? అసలు పవన్‌కి, గుడ్లకి సంబంధం ఏంటి? అని అనుకుంటున్నారా! ఇదంతా పవన్ అభిమానుల పాపమేనండి! వాళ్లు చేస్తున్న ‘అతి’ వల్లే పవన్ అడ్డంగా బుక్కవ్వాల్సి వస్తోంది. నిజానికి.. ఆయనకి ఏమాత్రం సంబంధం లేకపోయినప్పటికీ ప్రతి విషయంలోనూ లాగుతున్నారు. ఇదిగో.. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ చేసిన మరో చెత్త విన్యాసం కారణంగా ఏకంగా పోలీస్ కేసు పవన్ నెత్తిన పడింది.

మేటర్ ఏంటంటే.. మహేష్ రానురాను తన కత్తికి పదును పెడుతున్న విషయం పవన్ ఫ్యాన్స్‌కి చిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది. తమ కోపాన్ని దిగమింగుకోలేక అతనిపై విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. ఆల్రెడీ వాట్సాప్, ఫేస్‌బుక్, వీడియో మెస్సేజ్‌లతో కత్తికి నిద్రలేకుండా చేస్తున్న వీళ్లు.. ఇప్పుడు మరో దుశ్చర్యానికి పాల్పడ్డారు. కత్తి తన కారులో వెళ్తుండగా.. కొందరు వ్యక్తులు గుడ్లతో దాడి చేశారు. కొన్ని నిముషాలపాటు ఏమాత్రం గ్యాప్ లేకుండా.. కత్తి కారుపై గుడ్లతో దండయాత్ర చేశారు. ఇది కత్తి మహేష్‌కి తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. అంతే.. వెంటనే మనోడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి.. పవన్, అతని ఫ్యాన్స్‌పై ఫిర్యాదు చేశాడు. తనపై పవన్ ఫ్యాన్స్ గుడ్లతో దాడికి దిగారని, పవనే వెనకుండి ఇదంతా చేయించాడంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Tellmeboss.net

ఇంతవరకు బాగానే ఉంది కానీ.. కత్తిపై దాడికి దిగినవాళ్లు నిజంగా పవన్ అభిమానులేనని నిరూపించడానికి కత్తి దగ్గర సరైన సాక్ష్యాలు లేవు. ఎవరో కావాలనే ఇదంతా చేయించి ఉండొచ్చు కదా! పవన్ ఇమేజ్‌ని దెబ్బ తీసేందుకు అసాంఘిక శక్తులు ఈ చర్యకి పాల్పడి ఉండొచ్చుగా! పైగా.. తనపై ఫ్యాన్స్ నుంచి దాడి జరిగిన ప్రతిసారీ పవనే చేయిస్తున్నాడని కత్తి ఆరోపణలు చేస్తున్నాడే.. అందుకు తగిన సాక్ష్యాధారాలు లేనిదే ఇలాంటి అపనిందలు మోయడం సమంజసం కాదు. దీనికి కత్తి ఎలాంటి వివరణ ఇస్తాడో చూద్దాం!

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.