క్యాస్టింగ్ కౌచ్‌పై ‘మెగా’ కుట్ర.. కత్తి కొత్త డ్రామా

సినీ క్రిటిక్ కత్తి మహేష్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీ స్టేటస్ అందుకున్నాడు. దీంతో.. తనకు మించిన తోపు ఎవ్వరూ లేరనే ఫీలింగ్‌తో మనోడు తెగ రెచ్చిపోతున్నాడు. అన్ని ఇష్యూస్ మీద ఏవో సూచనలిస్తూ.. తానో మార్గదర్శినని డబ్బా వాయించుకుంటున్నాడు. అఫ్‌కోర్స్.. కాస్త ఇమేజ్ వున్నవాళ్ళందరి పరిస్థితి ఇంతేగానీ.. ‘కత్తి’కి మాత్రం పదును చాలా ఎక్కువ! అలాంటి తనపై ఏవైనా ఆరోపణలు వస్తే మాత్రం కత్తి కొత్త డ్రామాకి తెరలేపుతుంటాడు. మ్యాటర్ డైవర్ట్ చేయడానికి ఏవేవో వ్యాఖ్యలు చేస్తుంటాడు. ఇప్పుడు మళ్ళీ ఇదే బాట పట్టాడు కత్తి.

గతకొన్ని రోజుల నుంచి టాలీవుడ్‌ని గడగడలాడిస్తున్న ‘క్యాస్టింగ్ కౌచ్’ మీద కత్తి గళమెత్తిన సంగతి తెలిసిందే! ఇండస్ట్రీ తీరును తప్పుబడుతూ మనోడు తీవ్ర వ్యాఖ్యలే చేశాడు. ఇందులో భాగమైన వాళ్ళపై రెచ్చిపోవడమే కాదు.. దీనిపై స్పందించని స్టార్లను కూడా ఏకిపారేశాడు. ఇదిచూసి.. కత్తి కరెక్ట్ చేస్తున్నాడని జనాల్లో అతనిపై మంచి ఇంప్రెషన్ కలిగింది. కానీ.. ఇంతలోనే సునీత అనే జూనియర్ ఆర్టిస్ట్ బాంబ్ పేల్చడంతో కత్తి బండారం బయటపడింది. రూ.500 ఇచ్చి తనని వాడుకున్నాడని టివి ఛానెల్ సాక్షిగా కుండబద్దలు కొట్టింది. కలవడానికి వచ్చిన తనని రూంలో బంధించి.. బలవంతంగా రేప్ చేయబోయాడని షాకింగ్ కామెంట్స్ చేసింది. తన దగ్గర సాక్ష్యాలు కూడా వున్నాయని.. కత్తి నిజస్వరూపం బయటపెడతానని ఆమె పేర్కొంది.

దీంతో ఖంగుతిన్న కత్తి.. వెంటనే పారిపోకుండా ఈ ఆరోపణల్ని తోసిపుచ్చేందుకు కొత్త డ్రామాకి తెరలేపాడు. సునీత తనకు పరిచయమే కానీ.. రేప్ అటెంప్ట్ చేయలేదని.. తాను నిర్దోషినని ఆ లైవ్ డిబేట్‌లోనే చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మేటర్ డైవర్ట్ చేయడానికి ‘మెగా’ కుట్ర వుందంటూ మరో కథని స్టార్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు సునీతను కావాలనే తన మీదికి ఉసిగొల్పారని ఆరోపిస్తూ.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మీద కూడా కేసు పెట్టనున్నట్లు చెప్పాడు. మరి ఈ ఆరోపణలపై మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

సాధారణంగా కొంత ఇమేజ్ వున్న సెలబ్రిటీలు తమపై ఆరోపణలు వచ్చిన వెంటనే పారిపోకుండా ఏవో కథలు ఆడుతుంటాడు. నోరు మెదపకుండా వుంటే.. ఆ ఆరోపణల ప్రభావం జనాలమీద పడటమే కాకుండా తమ ఇమేజ్ దెబ్బతింటుందని.. పరువు గంగలో కలిసిపోతుందని.. కొత్త డ్రామాకి తెరలేపుతారు. ఇప్పుడు కత్తి మహేష్ అదే చేస్తున్నాడు. ఏ అమ్మాయి లైవ్‌లోకొచ్చి ఇలా మాట్లాడదు. కత్తిమీద ఆరోపణలు చేసిందంటే.. ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగే వుంటుంది. చూద్దాం.. ఈ కథ మరెన్ని మలుపులు తిరుగుతుందో?

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.