కత్తిని కరిగించిన పూనం ట్వీట్

kathi mahesh says sorry to poonam kaur
Tellmeboss.net

కత్తి మహేష్ ఎవరినైనా ఒక్కసారి టార్గెట్ చేశాడంటే చాలు.. ఇక రెగ్యులర్‌గా తన కామెంట్లతో పొడిచి పొడిచి వేధిస్తాడే తప్ప తన మాటల యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించుకోడు. తాడో-పేడో తేల్చుకోవాలని రంగస్థలంలో దిగిపోతాడంతే! రీసెంట్‌గా హీరోయిన్ పూనమ్ కౌర్‌ని ఎలా కడిగిపారేశాడో అందిరికీ తెలుసు.

తనని ఫ్యాట్సో అని చెప్పిన పాపానికి ఏకంగా ఆమె పర్సనల్ లైఫ్‌నే కెలికేశాడు ఈ మహానుభావుడు. పవన్‌తో ఎఫైర్ ఉందని అభియోగాలు చేయడంతోపాటు తన దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని.. ఈ విషయాన్ని అంత సులువుగా వదిలిపెట్టనంటూ మీడియా సాక్షిగా వ్యాఖ్యలు చేశాడు. అలాంటి కత్తి ఇప్పుడు దెబ్బకు కరిగిపోయాడు. పూనమ్ చేసిన ఒక్క ట్వీట్‌కి కరిగిపోయి.. తనని క్షమించమని వేడుకున్నాడు. అంతగా ఆ ట్వీట్‌లో ఏముందనుకుంటున్నారా? అతనికి మద్దతుగా పూనం కామెంట్ చేయడమే.

Tellmeboss.net

ఒక న్యూస్ ఛానెల్ డిబేట్‌లో భాగంగా తల్లి గురించి చెప్పమని కత్తికి ఓ దర్శకుడు చెప్పడంతో.. బాగా హర్ట్ అయి ఆయన మధ్యలోనే లేచి వెళ్లిపోయాడు. ఇక ఆ దృశ్యంపై ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియాలో కత్తిపై సెటైర్లు వేస్తున్నారు. ట్విటర్‌లో ఓ అభిమాని పూనం పేరుని ట్యాగ్ చేస్తూ ‘నీ తల్లి సీక్రెట్ ఏంటి కత్తి’ అని నేరుగా కత్తి మహేష్‌కి ట్వీట్ చేశాడు. దీనికి పూనం దయనీయమైన ఒక్క ట్వీట్ చేసి అందరి హృదయాలతోపాటు కత్తిని కూడా కరిగించేసింది.

ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే.. ‘‘నువ్వెవరో నాకు తెలీదు కానీ ఒకరి తల్లిని ఇలా డీగ్రేడ్ చేయడం కరెక్ట్ కాదు.. నేను సీన్సియర్‌గా రిక్వెస్ట్ చేస్తున్నా.. ప్లీజ్’’ అంటూ ట్వీటింది. ఇది చూసి కరిగిపోయిన కత్తి.. పూనం కూడా ఒక మహిళే కదా గ్రహించి ఆమెకి ఇంటర్వ్యూ సాక్షిగా క్షమించమని కోరుకున్నాడు. క్షుద్రపూజలు, అలాగే ఆమె పర్సనల్ విషయాలపై తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందంటూ ఒక న్యూస్ ఛానెల్‌లో సారీ చెప్పాడు.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.