స్టార్ హీరోస్‌కి ‘మెగా కత్తి’ దింపిన మహేష్

ఏదైనా ఒక అంశం హాట్ టాపిక్ అయినప్పుడు.. దానికి అనుబంధంగా షాకింగ్ కామెంట్స్ చేస్తూ మరో సంచలనానికి తెరలేపుతుంటాడు కత్తి మహేష్! కానీ.. అతని వ్యాఖ్యల్లో మాత్రం ఆలోచించదగిన మేటరే వుంటుంది. లేటెస్ట్‌గా అలాంటి వ్యాఖ్యలే చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు.

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎప్పట్నుంచో ఉంది కానీ.. శ్రీరెడ్డి వ్యవహారంతో చాలా రహస్యాలే వెలుగులోకి వచ్చాయి. అగ్ర నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్.. స్టార్ రైటర్ కోన వెంకట్‌లాంటి వాళ్ల పేర్లు బయటికి రావడంతో.. ఈ మేటర్ సీరియస్ టర్న్ తీసుకుంది. ఇన్నాళ్ళూ ఫేమ్ కోసమే శ్రీరెడ్డి హంగామా చేస్తోందనుకుంటే.. ఆమె బయటపెట్టిన సాక్ష్యాల దృష్ట్యా పెద్ద రాకెట్టే నడుస్తోందని నిజమని నమ్మక తప్పట్లేదు. అయితే.. ఇండస్ట్రీకే సంబంధించిన ఈ సీరియస్ ఇష్యూ మీద స్టార్ హీరోలుగానీ, ఇతర బడా సెలబ్రిటీలు కూడా ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

ఈ నేపథ్యంలోనే స్టార్లకు చురకలంటిస్తూ సినీ క్రిటిక్ కత్తి మహేష్ సంచలన ట్వీట్ చేశాడు. తనదైన శైలిలో బావ-బామ్మర్ది ట్వీట్ పెట్టాడు. ‘‘బామ్మర్తి : బావా.. ఇండస్ట్రీలో ఇంత రచ్చ జరుగుతుంటే ఈ మెగాలు.. గిగాలు.. సూపర్‌లు.. పవర్ లు ఒక్క మాట కూడా బాధిత మహిళల గురించి అనడం లేదు. ఎందుకు?; బావ: వాళ్ల పేర్లు బయటికి రాలేదని సంతోషిస్తున్నారో.. మనకెందుకులే అని అన్ని విషయాల్లాగా ఊరుకుంటున్నారో నాకూ తెలియదు బామ్మర్ది!’’ అంటూ కుండబద్దలయ్యే ట్వీట్ పెట్టాడు కత్తి.

ఒకవిధంగా కత్తి ట్వీట్‌ని విశ్లేషిస్తే.. స్టార్స్ ఈ విషయంపై శ్రీరెడ్డి నిరసనపై స్పందించకపోవడం నిజంగా బాధాకరం. తమతమ రంగాల్లో ఏదైనా పెద్ద హడావిడి జరిగినప్పుడు.. ఆ రంగానికి చెందిన పెద్దదిక్కులు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. కానీ.. ఇక్కడ తమ ఇండస్ట్రీ గురించి ఇంత రాద్ధాంతం జరుగుతున్నా ఏ ప్రముఖ హీరో స్పందించకపోవడం విచారకరం.

Related posts:
అఖిల్ కి ఆ హీరోయిన్‌తో రొమాన్స్ కావాల‌ట‌!!
ఉరి శిక్ష తప్పించుకునేందుకు గర్భవతి అయిన మహిళా ఖైదీ
తెలుగు హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన జగపతి బాబు
ఆ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన యాంకర్ సుమ
పెళ్లి వేడుకలో విషాదం.. పెళ్లికొడుకు తండ్రి కాల్పుల్లో మరణించిన వైనం (వీడియో)
బుడ్డోడి మీద పోయిన కారు..అదృష్టం అర్థం ఏంటో చూడండి (వీడియో)

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.