‘బిగ్‌బాస్’ ట్రాప్‌లో కౌశల్ బలి

‘బిగ్‌బాస్-2’లో కౌశల్ ప్రయాణం ‘వార్ వన్‌సైడ్‌’లా అయ్యింది. తొలి రెండు వారాల్లో అతనికి పెద్ద గుర్తింపు లేకపోయింది కానీ.. ఎప్పుడైతే హౌస్‌మేట్స్ అతడ్ని కార్నర్ చేయడం మొదలుపెట్టారో, అప్పట్నుంచి కౌశల్‌కి సింపతి పెరిగింది. అలాగే.. తాను రిలేషన్స్ పెంచుకోవడానికి బిగ్‌బాస్‌కి రాలేదని, కేవలం గేమ్ ఆడటం కోసమే వచ్చానని ఓపెన్‌గా చెప్పడం కూడా జనాల్ని ఆకర్షించడంతో అతని క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఏకంగా హోస్ట్ నానికి మించిన ఆర్మీనే ఏర్పడిందంటే.. కౌశల్‌పట్ల జనాలు ఎంతగా ఆకర్షితులయ్యారో అర్థం చేసుకోవచ్చు. బహుశా ఇదే బిగ్‌బాస్‌కి అంతగా మింగుడుపడినట్లు లేదేమో.. అందుకే కౌశల్‌కి వ్యతిరేకంగా ప్లాన్స్ చేయడం మొదలుపెట్టాడు.

తమిళ బిగ్‌బాస్‌లో ఓవియా సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకున్నట్లు కౌశల్‌ని కూడా బయటికి పంపాలని ప్లాన్స్ వేస్తూ వస్తోంది బిగ్‌బాస్ యాజమాన్యం! కానీ.. అది సాధ్యపడలేదు. కౌశల్ మరింత స్ట్రాంగ్ అవుతూ వస్తుందడంతో.. మరోవైపు నుంచి కోత మొదలుపెట్టాలని స్కెచ్ గీసింది. అందుకు సరైన టైం కోసం వేచి చూస్తూ వస్తోంది. మొత్తానికి ఆ టైం రానే వచ్చేసింది. కౌశల్‌ని నెగెటివ్‌గా హైలైట్ చేసే బిగ్గెస్ట్ ఎలిమెంట్ చేతికి దొరకడంతో.. వెంటనే బయట ప్రొజెక్ట్ చేసేసింది. ఈ బుధవారం (08-08-18) రాత్రి ఎపిసోడ్ చూసినవాళ్ళకి ఆ విషయం తెలిసే వుంటుంది. అదేంటంటే.. మెయిన్ గేట్ దగ్గర కౌశల్, నూతన్ మొత్తం హౌస్ గురించి మాట్లాడుతున్నప్ప బాబు గోగినేని ప్రస్తావన వచ్చింది. ఆ టైంలో బాబు పేరొచ్చిన ప్రతిసారి కౌశల్ ఆయన్ను వాడు, వీడు అంటూ సంబోధించాడు. వీళ్లిద్దరి మధ్య పడట్లేదన్న విషయం తెలిసిందే కానీ.. వయసుకి మర్యాద ఇచ్చి కనీస మర్యాదైనా ఇవ్వాల్సింది.

వేరేవాళ్ళు ఇలాగే చాటుగా మాట్లాడినప్పుడు బాబుని గౌరవంగా సంబోధించారు. ఆయన, ఈయన లేదా పేరు పలికేవారు తప్ప.. వాడు, వీడు అనలేదు. ఇక్కడే కౌశల్ మాత్రం ఆ పదాలతో సంబోధించి.. తన అసలు ‘బుద్ధి’ బయటపెట్టాడు. ఏదైనా వుంటే నేరుగా మాట్లాడొచ్చు కదా అని నూతన్ అంటే.. ‘వాడ్ని పిలిచి మనం మాట్లాడేది ఏంటి’ అనడం కూడా పెద్ద తప్పే! ఏదున్నా తాను డైరెక్ట్‌గానే క్లారిఫై చేసుకుంటా అని చెప్పే కౌశల్.. బాబు విషయంలో అదే ధోరణి ఎందుకు పాటించట్లేదు? ఇక్కడే కౌశల్ డబుల్ స్టాండర్డ్ కూడా బయటపడింది. మొత్తానికి.. ‘బిగ్‌బాస్’ వేసిన ట్రాప్‌లో కౌశల్ వచ్చేసినట్లే! ఇంకో రెండు, మూడు పాయింట్స్ ఇలాంటివే దొరికితే.. కౌశల్‌కి గండమే!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.