ఖాకి క్లోజింగ్ కలెక్షన్స్.. బతికి బట్టకట్టిన బయ్యర్స్!

తమిళ హీరో కార్తికి అక్కడ ఎంతటి ఫాలోయింగ్ ఉందో తెలుగులో కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. కేవలం సూర్య తమ్ముడిగా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో ఏర్పర్చుకున్నాడు కార్తి. వరుసగా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుకుంటున్న కార్తి తాజాగా ‘ఖాకి’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో మనముందుకు వచ్చాడు. ఈ సినిమా నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి టాక్‌ను సొంతం చేసుకోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్స్‌ను రాబట్టడంలో సక్సెస్ అయ్యింది.

ఖాకి చిత్రాన్ని వినోథ్ డైరెక్ట్ చేయగా గిబ్రన్ మ్యూజిక్ అందించాడు. ఇక ఈ సినిమా టోటల్ రన్‌లో రూ. 5.53 కోట్లు వసూలు చేసి హిట్ సినిమాగా నిలిచింది. ఖాకి రెండు తెలుగు రాష్ట్రాల క్లోజింగ్ కలెక్షన్స్ ఏరియాల వారిగా ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – క్లోజింగ్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 1.80 కోట్లు
సీడెడ్ – 0.85 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.82 కోట్లు
గుంటూరు – 0.58 కోట్లు
తూర్పు గోదావరి – 0.50 కోట్లు
కృష్ణా – 0.50 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.30 కోట్లు
నెల్లూరు – 0.18 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 5.53 కోట్లు

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.