ఖాకి రెండు వారాల నైజాం కలెక్షన్స్

తమిళ స్టార్ హీరో కార్తి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఖాకి’ నవంబర్ 17న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మంచి టాక్‌తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోవడంతో సక్సెస్‌ఫుల్‌గా రెండు వారాలు కంప్లీట్ చేసుకుంది.

ఖాకి చిత్రం ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కడంతో ఈ మూవీకి అదిరిపోయే మాస్ ఫాలోయింగ్ లభించింది. ఇక కార్తి చేసిన యాక్షన్ ఫైట్స్‌ మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్‌లా మిగిలాయి. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మంచి అంచనాలు క్రియేట్ అవ్వడంతో ఒక్క నైజాం ఏరియాలో రెండు వారాలు ముగిసేసరికి ఏకంగా రూ. 2.1 కోట్లు వసూలు చేసింది. కేవలం నైజాం ఏరియాలోనే ఇంతటి కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా మిగతా ఏరియాల్లో ఎంతవరకు కలెక్ట్ చేసిందనే వివరాలు తెలియాల్సి ఉంది.

వినోద్ డైరెక్ట్ చేసిన ఖాకి చిత్రం అటు తమిళంలోనూ హిట్ టాక్ తెచ్చుకోవడంతో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతోంది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.