మోదీకి కొరటాల పంచ్.. ఇప్పుడైనా ‘మనిషి’గా మారవయ్యా!

ఇప్పటికే తన లేటెస్ట్ మూవీ ‘భరత్ అనే నేను’ ఫస్ట్ విజన్‌తో రాజకీయ నాయకులు నరాలు జివ్వుమనేలా మహేష్ చేత కౌంటర్లు వేయించాడు కొరటాల శివ. ఇచ్చిన మాట మీద నిలబడలేకపోతే అసలు ‘మగాళ్ళే’ కాదనే డైలాగ్‌తో చెంపఛెళ్ళుమనిపించాడు. అయితే.. అది ‘రీల్’ డైలాగ్ కావడంతో పెద్దగా ప్రభావం వుండదని భావించాడో ఏమో తెలీదు కానీ.. ఈసారి కొరటాల ‘రియల్’గా బాంబులు పేల్చాడు. ఏపీ ప్రభుత్వానికి అదిస్తాం.. అలా అభివృద్ధి చేస్తామని మాటిచ్చి నిండా మోసం చేసిన దేశప్రధాని మోదీకే చురకలంటించాడు.

‘‘పదండి.. అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్రమోదీ చేసిన ప్రామిస్‌‌ని గుర్తుకు తెప్పించి.. ఆయన్ను ‘మగాడి’గా మారుద్దాం!’’ అని సలహా ఇస్తూనే.. మోదీకి నిఖార్సైన ప్రశ్న సంధించాడు. ‘‘రెండు తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో ఒక భాగమేనని మీరు నిజాయితీగా భావిస్తున్నారా?’’ అంటూ ట్వీటేశాడు. దీనిపై జవాబులు వస్తాయో రావో అది వేరే విషయం.. కానీ కొరటాల ఇలా ట్వీట్ చేయడం నిజంగా షాకింగ్. రాజకీయ నాయకులే ప్రశ్నించడానికి సాహసించలేకపోతుంటే.. ఒక ఫిల్మ్ మేకర్ ఇలా నిక్కచ్చిగా నిలదీయడం నిజంగా గట్స్ వుండాలి. అవి తనకు టన్నులకొద్దీ వున్నాయంటూ జస్ట్ ఒకే ఒక్క ట్వీట్ ద్వారా తేల్చిచెప్పాడు ‘భరత్’ దర్శకుడు. శభాష్ కొరటాల.. వీ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యు!

ఇక్కడివరకు బాగానే వుంది కానీ.. ఇదే టైంలో విమర్శకులు పెదవి విరచకుండా వుంటారా? కొరటాల అక్కడ ట్వీట్ చేయడం ఆలస్యం.. ఇక్కడ పులోమని దిగొచ్చేశారు. ఏదో సినిమా ప్రమోషన్ కోసమే కొరటాల ఈ తరహా పావులు కదుపుతున్నాడేగానీ.. అంతకుమించి ఏం లేదంటూ గాలి తీసేస్తున్నారు. ఇలాంటివారిక్కూడా కొరటాల గూబ గుయ్‌మనేలా కౌంటరిస్తే.. అప్పుడు బుద్దొస్తుంది. ఏదేమైనా.. మోదీనే నిలదీసే సాహసం చేసిన కొరటాలకి హ్యాట్సాఫ్!

Related posts:
శృతిహాసన్ ‘క్లీవేజ్’ డ్రెస్సుపై వైవా హర్ష హాట్ కామెంట్
టీమిండియాకు తన ఎదఅందాలను బహుమతించిన బ్యూటీ
మసాజ్ సెంటర్‌లో వ్యభిచారం.. అడ్డంగా బుక్కైన ముగ్గురు యువతులు
ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్ లు బ్యాన్ చెయ్యాలట
లవర్‌ని అక్కడ కొరికింది.. దెబ్బకు చచ్చాడు!
మిస్టరీగా మారిన హీరోయిన్ మృతి కేసును మలుపు తిప్పిన ‘చాటింగ్’..!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.