చరణ్‌కి 25%తో ‘స్వీట్’ షాకిచ్చిన కొరటాల

‘భరత్ అనే నేను’ చిత్రం రిలీజైన దగ్గర్నుంచీ.. కొరటాల నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటని ఇండస్ట్రీలో ఒకటే చర్చ! తాను ఎవరితో కలిసి పనిచేయాలనుకున్నాడో.. వాళ్ళందరూ ఇతర ప్రాజెక్టులతో బిజీ అయిపోవడంతో.. ఏ హీరోతో చేతులు కలుపుతాడా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు మనోడు తన తదుపరి మూవీపై తుదినిర్ణయం తీసేసుకున్నట్లు సమాచారం!

ఎలాగో వచ్చే ఏడాది వరకూ ఏ ఒక్క స్టార్ హీరో ఖాళీగా లేరు. నెక్ట్స్ ఇయర్‌లో కొందరు హీరోలు ఫ్రీ అవుతారు. వాళ్ళతో చిరంజీవి కూడా ఒకరు! అందుకే.. ఇతరులకంటే చిరుతో చేస్తేనే బెటర్ అనుకుని, ఆయనతో ఇప్పుడే చేతులు కలిపాడు. తాను చెప్పిన స్టోరీలైన్ చిరుతోపాటు చరణ్‌కి కూడా చాలా బాగా నచ్చడంతో.. చిరు ఫ్రీ అయ్యేంతవరకూ స్ర్కిప్ట్‌ని పవర్‌ఫుల్‌గా రెడీ చేద్దామని కొరటాల ఫిక్స్ అయినట్లు తెలిసింది. ట్విస్ట్ ఏంటంటే.. పారితోషికంకి సంబంధించిన డీలింగ్స్ కూడా అయిపోయాడట! ప్రస్తుతమున్న రెమ్యునరేషన్ కంటే 25 శాతం ఎక్కువ అడిగినట్లు తెలిసింది.

ప్రస్తుతం కొరటాల సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. కమర్షియల్ సినిమాల్ని పర్ఫెక్ట్‌గా డీల్ చేయడంలో దిట్ట కాబట్టి.. అతని రిక్వెస్ట్ మేరకు రామ్ చరణ్ 25% ఎక్కువ పారితోషికం ఇచ్చేందుకు రెడీ అయ్యాడట! ‘సైరా’ షూటింగ్ ముగిసిన వెంటనే ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ మీదకి తీసుకెళ్ళాలని డిసైట్ అయ్యారు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.