శాతకర్ణికి ఎన్టీఆర్‌తో లింక్ పెట్టిన బాలయ్య!

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించి ఎలాంటి వార్త వినిపించినా ప్రేక్షకులు ఆతృతగా చూస్తున్నారు. దర్శకుడు తేజ డైరెక్షన్‌లో ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా అప్పుడే అటక్కెక్కింది. బాలయ్యతో మనస్పర్థలు ఏర్పడటంతో దర్శకుడు తేజ ఈ సినిమా నుండి వాకౌట్ చేశాడు. దీంతో బాలయ్య ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.

కాగా ఈ సినిమాను బాలయ్య స్వయంగా డైరెక్ట్ చేస్తున్నాడనే వార్త ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది. కానీ బాలయ్య మాత్రం తన తండ్రి సినిమాను డైరెక్ట్ చేయాలనుకోవడం లేదట. దీంతో తనకు గౌతమిపుత్ర శాతకర్ణి వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందించి దర్శకుడు క్రిష్‌ను ఈ సినిమా డైరెక్ట్ చేయాల్సిందిగా కోరాడట బాలయ్య. దీనికి క్రిష్ దగ్గర్నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.

ప్రస్తుతం బాలీవుడ్‌లో మణికర్ణిక అనే సినిమాను తెరకెక్కిస్తున్న క్రిష్ ఆ సినిమా పూర్తయిన తరువాత ఎన్టీఆర్ బయోపిక్‌ కోసం రెడీ అవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి క్రిష్-బాలయ్య కాంబో ఎన్టీఆర్‌కు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.