కృష్ణార్జున యుద్ధం ఫస్డ్ డే కలెక్షన్స్

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘కృష్ణార్జున యుద్ధం’ రిలీజ్‌కు ముందే మంచి అంచనాలను క్రియేట్ చేసింది. వరుస హిట్స్‌తో ఫుల్ ఫాంలో నాని ఈ చిత్రంలో మరోసారి డ్యుయెల్ రోల్ చేస్తుండటంతో ఈ అంచనాలు రెట్టింపు అయ్యాయి. అంతేగాక ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా రిలీజ్ రోజున మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

నాని డ్యుయెల్ రోల్‌లో‌ నటించడంతో ఈ సినిమ చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపించారు. ఇక ఈ సినిమాలో నాని సరసన అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ డిల్లోన్ హీరోయిన్స్‌గా నటించగా మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.58 కోట్లు కలెక్ట్ చేసి నాని కెరీర్‌లో నాలుగో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. MCA, నిన్ను కోరి, ఈగ చిత్రాల తరువాత కృష్ణార్జున యుద్ధం నిలిచింది. ఏరియాలవారీగా ఈ చిత్రం తొలిరోజు కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – ఫస్ట్‌డే కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 1.39 కోట్లు
సీడెడ్ – 0.53 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.52 కోట్లు
గుంటూరు – 0.53 కోట్లు
ఈస్ట్ గోదావరి – 0.30 కోట్లు
వెస్ట్ గోదావరి – 0.28 కోట్లు
కృష్ణా – 0.29 కోట్లు
నెల్లూరు – 0.20 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 4.58 కోట్లు

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.