‘కృష్ణార్జున‌ యుద్ధం’ మూవీ రివ్యూ-రేటింగ్

సినిమా : కృష్ణార్జున‌ యుద్ధం
న‌టీన‌టులు : నాని, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్స‌ార్ మీర్, బ్రహ్మాజీ, త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం : మేర్ల‌పాక గాంధీ
నిర్మాత‌లు : సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది
సంగీతం : హిప్‌హాప్ త‌మిళ‌
ఛాయాగ్ర‌హ‌ణం : కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని
బ్యానర్ ‌: షైన్ స్క్రీన్స్‌
విడుద‌ల తేదీ: 12 -04-2018

వరుస విజయాలతో ఫుల్ స్వింగ్‌లో వున్న నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘కృష్ణార్జున యుద్ధం’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం పోషించగా… అనుపమ, రుక్సార్ మీర్‌లు హీరోయిన్లుగా నటించారు. నాని సినిమా అన‌గానే క‌చ్చితంగా వినోదం వుంటుందనే అభిప్రాయం జనాల్లో పాతుకుపోయింది కాబట్టి.. ఈ మూవీపైనే అదే నమ్మకం పెట్టుకున్నారు. పైగా.. ఒక మామూలు చిత్రాన్ని కూడా తన అభినయంతో మరో స్థాయికి తీసుకెళ్ళే ప్రతిభ సొంతమైన నాని.. ఇందులో డ్యుయెల్ రోల్‌లో నటించడంతో మరింత క్రేజ్ నెలకొంది. మరి.. ఆ అంచనాల్ని అందుకోవడంలో ఈ చిత్రం సక్సెస్ అయ్యిందా? లేదా? రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం…

కథ :

కృష్ణ‌(నాని) ఎప్పుడు సరదాగా వుండే యువకుడు. చిత్తూరి జిల్లా అకుర్తిలో వుండే కృష్ణ చూసిన ప్రతి అమ్మాయిని ప్రేమించాలనుకుంటాడు. ఈ క్రమంలోనే కృష్ణకు ఊరి సర్పంచ్ మనవరాలు అయిన రియా (రుక్సార్)తో పరిచయం ఏర్పడడం, అది ప్రేమగా మారడం జరుగుతుంది.

కట్ చేస్తే.. అర్జున్‌(నాని) ఒక రాక్‌స్టార్. యూరోప్‌లో వుండే ఇతను సుబ్బ‌ల‌క్ష్మి(అనుప‌మ‌)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమెను కూడా తన ప్రేమలో పడేస్తాడు. ఇలా ఈ ఇద్దరి జంటల కథలు సాఫీగా సాగుతున్న టైంలో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. దీంతో.. కృష్ణ, అర్జున్‌లు తాము ప్రేమించిన అమ్మాయిలకు దూరం అవుతారు.

ఇంతకీ ఆ మలుపు ఏంటి? ఎందుకు తాము ప్రేమించిన అబ్బాయిలను సుబ్బలక్షి, రియాలు దూరం పెడతారు? అసలు కృష్ణకి, అర్జున్‌లకి ఉన్న లింకేంటి? విడిపోయిన ఈ ప్రేమజంటలు తిరిగి ఒక్కటవుతారా? లేదా? అనే అంశాలతోనే ఈ సినిమా సాగుతుంది.

విశ్లేషణ :
ఈ సినిమా కథ చాలా సింపుల్.. పాతది కూడా! వేర్వేరు నేపథ్యాలున్న ఇద్దరు అబ్బాయిలు తమకు నచ్చిన అమ్మాయిలతో ప్రేమలో పడడం.. వాళ్ళ లవర్స్ ఒకే విధమైన సమస్యలో చిక్కుకోవడం.. వాళ్ళని హీరోలిద్దరూ ఎలా కాపాడారు అనేదే కథ! ఇలాంటి స్టోరీలైన్స్‌తో ఇప్పటికే ఎన్నో మూవీలొచ్చాయి. కాకపోతే ఇక్కడ నాని ద్విపాత్రాభినయం పోషించడమే ప్రత్యేకం.. అదే ఈ మూవీకి ప్లస్ పాయింట్ కూడా!

సింగిల్ రోల్‌తోనే సినిమా మొత్తాన్ని నడిపించే సత్తా వున్న నాని ఇక డ్యుయెల్ రోల్ ఇస్తే ఊరికే ఉంటాడా? నటనని చించి అవతల పారేశాడు. బలం లేని కథకి తన నటన జోడించి.. ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఫస్టాఫ్ మొత్తం చాలావరకు సరదాగానే సాగిపోతుంది. స్టార్టింగ్ సాదాసీదాగా అనిపించినా.. సినిమా కడిచేకొద్దీ నవ్వులు పూయిస్తుంది. కృష్ణ, అర్జున్ పాత్రల నేపథ్యం.. హీరోయిన్లతో లవ్ ట్రాక్‌.. కామెడీ ఎపిసోడ్స్‌‌తో సినిమాని ఎంటర్టైనింగ్‌గా నడిపించాడు. పాటలు కూడా సందర్భానుకూలంగా బాగా కుదిరాయి. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అనూహ్య మలుపుతో ముగుస్తుంది. అది సెకండాఫ్‌పై ఆసక్తి రేకెత్తించింది కానీ.. అనుకున్న స్థాయిలో అది లేకపోవడమే పెద్ద మైనస్ పాయింట్.

సమస్యలో చిక్కుకున్న హీరోయిన్లను హీరోలు ఎలా కాపాడుకున్నారనే అంశం చుట్టే ద్వితీయార్థం కొనసాగుతుంది. ఇది బలంగా లేకపోవడం, వినోదం కూడా తగ్గడంతో సినిమా సాగదీతగా అనిపిస్తుంది. అయితే.. ఇక్కడే నాని విశ్వరూపం చూపించాడు. బోర్ అనిపించినప్పుడల్లా తన నటనతో అలరించాడు. ముఖ్యంగా కృష్ణ క్యారెక్టర్‌లో ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కూ నాని త‌న‌దైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించాడు.

నటీనటుల ప్రతిభ :
నాని గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.. ఎలాంటి పాత్ర ఇచ్చినా దానికి ప్రాణం పోస్తాడు. ఇందులోనూ ద్విపాత్రాభినయంలో బ్రహ్మాండంగా నటించాడు. ముఖ్యంగా కృష్ణ రోల్‌లో ఇరగదీశాడు. ఇతనే ఈ మూవీకి హైలైట్. మొత్తం తన భుజాన వేసుకుని సినిమాని సింగిల్ హ్యాండ్‌తో హ్యాండిల్ చేశాడు. హీరోయిన్లిద్దరూ అందంగా కనిపించడంతోపాటు తమ పాత్ర పరిధి బాగానే నటించారు. బ్రహ్మాజీతోపాటు ఇతర కమెడియన్లు బాగానే నవ్వులు పూయించారు. మిగతా నటీనటులు మామూలే!

టెక్నికల్ ప్రతిభ :
కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కెమెరా వర్క్ చాలా బాగుంది. యూర‌ప్‌తోపాటు చిత్తూరు జిల్లా ప‌ల్లెటూరి అందాల‌ను చాలా అందంగా చూపించింది. హిప్‌హాప్ త‌మిళ అందించిన పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. ముఖ్యంగా మూడు పాటలు చాలా బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా అదిరింది. సెకండాఫ్‌లో కత్తెరకు కాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. దర్శకుడు ఎంచుకున్న కథలో పెద్ద బలం లేకపోయినా.. సినిమాని నడిపించిన విధానం బాగుంది. క‌థానాయకుల పాత్ర‌ల‌ను స‌మాంత‌రంగా నడిపించడం, కామెడీని పండించడంలో తన సత్తా చాటుకున్నాడు.

చివరగా : కృష్ణుడు గెలిచిన యుద్ధం.. అర్జునుడికి పరాభవం!
రేటింగ్ : 3/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.