‘నాతో పడుకుంటేనే ఆఫర్’.. కమెడియన్‌కి లేడీ నిర్మాత షాక్ (ఫోటోలు)

Tellmeboss.net

ఇండస్ట్రీలో అమ్మాయిలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయనే వార్తలు తరచూ వింటూనే వున్నాం.. కానీ అబ్బాయిలు కూడా అలాంటి వేధింపులకు గురవుతున్నారనే సంచలన విషయం లేటెస్ట్‌గా వెలుగుచూసింది. ఇది నమ్మశక్యంగా లేకపోయినా.. జరిగింది మాత్రం వాస్తవం. స్వయంగా ఓ లేడీ నిర్మాతో తనతో పడుకుంటేనే ఆఫర్ ఇస్తానని చెప్పడంతో.. ఆ నటుడు నిర్ఘాంతపోయాడు. చివరికి లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయేమోనని భయపడిపోయి.. అతను ఆ అవకాశాన్నే వదులుకున్నాడు.

Tellmeboss.net

ఇంతకీ ఆ నటుడు ఎవరనేగా మీ సందేహం! మరెవ్వరో కాదు.. ‘జబర్దస్త్’ కార్యక్రమంతో కమెడియన్‌గా మంచి గుర్తింపు సాధించిన ఫణి! ఈమధ్య ఇతనికి రెగ్యులర్‌గా సినిమా అవకాశాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాను ఒక లేడీ ప్రొడ్యూసర్ నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు ఈ కమెడియన్ రీసెంట్‌గా ఓ సామాజిక మాధ్యమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. దాని గురించి ఫణి మాట్లాడుతూ.. ‘‘ఓ మూవీకోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి నేను వెళ్ళాను. ఆ మూవీకి నిర్మాత, దర్శకులు ఇద్దరూ మహిళలే! ఆడిషన్ పూర్తయ్యాక “అంతా ఓకే కదా నీకు” అని వాళ్ళు అడిగారంట. అందుకు తాను ‘‘అంతా ఓకే మేడమ్’’ అని బదులివ్వగా.. “కమిట్మెంట్ కూడా ఓకే కదా’’ అని వాళ్ళు అడిగారట!’’ అని వాళ్ళు అడిగారని ఫణి తెలిపాడు.

దీంతో ఖంగుతిన్న తాను.. లేనిపోని సమస్యలు వస్తాయేమోనని భావించి, ఆ అవకాశాన్ని వదులుకున్నానని ఫణి తెలిపాడు. అయితే.. ఆ లేడీ నిర్మాత పేరు మాత్రం ఫణి బయటపెట్టలేదు. ఇలాంటి అనుభవాలు తనకొక్కడికే కాదని.. ఇతర అబ్బాయిలకు కూడా ఎదురవుతుంటాయని ఫణి వెల్లడించాడు.

Related image

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.