ఇండస్ట్రీలో ‘క్యాస్టింగ్ కౌచ్’ చాలా కామన్ : లక్ష్మీరాయ్

శ్రీరెడ్డి రగిల్చిన ‘క్యాస్టింగ్ కౌచ్’ నిప్పు ఇప్పుడు ఇండస్ట్రీలో అగ్గి రాజేస్తోంది. ఎక్కడచూసినా దాని గురించే చర్చ నడుస్తోంది. అందుకే.. ప్రతి ఆర్టిస్టుకి దీనికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కొందరు ఈ అంశాన్ని సున్నితంగా తోసిపుచ్చితే.. ఇంకొందరు మాత్రం సంచలన వ్యాఖ్యలతో మరింత హీట్ పెంచుతున్నారు. లేటెస్ట్‌గా లక్ష్మీరాయ్‌కి కూడా ఈ ప్రశ్న ఎదురవ్వగా.. ఆమె షాకింగ్ కామెంట్స్‌తో ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది.

ఇండస్ట్రీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చే హీరోయిన్లకు ఈ క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఖచ్చితంగా ఎదురవుతుందని, అవకాశాల పేరుతో లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తుంటారని లక్ష్మీరాయ్ తెలిపింది. అందుకు లొంగడమా..? లేక సినిమా ఛాన్స్ వదులుకోవడమా..? అనే రీతిలో అమ్మాయిలు వ్యవహరిస్తుండడంతో.. ఈ క్యాస్టింగ్ కౌచ్ ఇంకా కొనసాగుతూనే వుందని ఆమె పేర్కొంది. మొదట్లో తనక్కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని.. కానీ తాను ఏనాడూ వాటికి లొంగలేదని లక్ష్మీరాయ్ చెప్పుకొచ్చింది.

ఇక ఇదే సమయంలో శ్రీరెడ్డి వ్యవహరంపైనా లక్ష్మీరాయ్ స్పందించింది. ఇండస్ట్రీలో మహిళలకు జరుగుతున్న అన్యాయంపై ఆమె ఎలుగెత్తి చాటుతోందని, తను కూడా బాధితురాలు కావడంతో ఇలా ప్రశ్నిస్తోందంటూ లక్ష్మీరాయ్ వివరణ ఇచ్చింది.

Related posts:
సొంత పార్టీ కార్యకర్తలే దానంపై కోడిగుడ్లతో దాడి
హీరోయిన్ శ్వేతా మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. పోలీస్ స్టేషన్‌లోనే తల్లీకూతుళ్ళ ఫైట్
ఏస్ అకాడమీ యువ క్రికెటర్లకు మెలకువలు నేర్పిన ద్రావిడ్
ఐదుగురు యువకులతో అడ్డంగా దొరికిపోయిన ముంబై మోడల్
తారక్ చెప్పిన ‘ఒరిజినల్’ సీక్రెట్.. ‘బిగ్‌బాస్’కి అదే ప్లస్
పవన్‌పై వర్మ లాజికల్ కౌంటర్స్.. మళ్ళీ బాంబ్ పేల్చాడుగా!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.