మాధవి ‘బిగ్’ బాంబ్.. ట్విస్ట్ అంటే ఇది ‘బాస్’

ఇప్పుడు మనం చూస్తున్న ‘బిగ్‌బాస్’ వ్యవహారాలన్నీ కాయిన్‌కి ఒకవైపు మాత్రమే! ఏదో సెలబ్రిటీలు గొడవపడటం, వారానికి రెండోసార్లు హోస్ట్ వచ్చి సంతోష పరచడం.. అంతా ఒక అందమైన ప్రపంచంలా తెరమీద కనిపిస్తోందంతే! తెరవెనుక కూడా ఎన్నో చీకటి కోణాలు దాగున్నాయని లేటెస్ట్‌గా మాధవీలత సంచలన నిజాల్ని బయటపెట్టింది. చివరికి ఇక్కడ కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఆమె బాంబ్ పేల్చింది.

అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం! రీసెంట్‌గా ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘బిగ్‌బాస్’కి కూడా క్యాస్టింగ్ కౌచ్ అంటుకుందని మాధవీలత పేర్కొంది. ‘బిగ్‌బాస్-2’ నుంచి తనకూ కాల్ వచ్చిందని.. మొదటిసారి మాట్లాడినప్పుడు సాధారణంగానే అనిపించినా, రెండోసారి మాత్రం వారి మాటల్లో తేడా కనిపించిందని, అది తనకు నచ్చలేదని ఆమె తెలిపింది. తాను కాస్త గట్టిగా మాట్లాడేసరికి తనకు తిరిగి ఆ షో యాజమాన్యం నుంచి కాల్ రాలేదని ఆమె వివరణ ఇచ్చింది.

ఇక రెండు సీజన్‌ల మధ్య గల వ్యత్యాసాల గురించి మాట్లాడుతూ.. మొదటి సీజన్ తనకు బాగా నచ్చిందని, రెండో సీజన్ మాత్రం అంత ఆసక్తికరంగా లేదంటూ కుండబద్దలు కొట్టింది. బహుశా తనకు ఆఫర్ రాకపోవడం వల్లనే మాధవీ ఈ కామెంట్ చేసి ఉండొచ్చేమో! ఏదైతేనేం.. మాధవీ చేసిన క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్‌తో ‘బిగ్‌బాస్’ షో కూడా వివాదాల్లోకి ఎక్కింది.

Related posts:
ర‌కుల్ దెబ్బ‌కు షాక‌య్యాడు..!
బ్యాగ్‌లో పాప.. ఫ్లైటు ప్రయాణం.. ఇంత వీజీనా?
‘సర్దార్’ యూనిట్ దారుణంగా మోసం చేసింది : కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ ఆవేదన
బాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ చేస్తూ మరిదికి అడ్డంగా దొరికిన వదిన.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!!
తారక్ టాలెంట్‌కి మహేష్ ఫిదా.. ‘హ్యాట్సాఫ్’ అంటూ కితాబు
ఎన్టీఆర్ ఇంటికి రఘు కూతురు.. చంపాలనుకున్న కమెడియన్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.