త్రివిక్రమ్ మంత్రానికి ఎన్టీఆర్ 28 మూవీపై తొలిగిన ‘షాడో’

అదిరిపోయే డైలాగ్స్ రాయడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత దిట్టో.. కాపీ కొట్టడంలోనూ అంతే ఎక్స్‌పర్ట్! ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలన్నీ తిరగేస్తే.. ప్రతిఒక్క మూవీలో హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి ఖచ్చితంగా కనిపిస్తుంది. అక్కడక్కడ సీన్లు లేపేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ‘అ ఆ’ సినిమా కథని యద్దనపూడి సులోచనా రాణి రాసిన నవల ‘మీనా’ స్ఫూర్తితో రాశాడు. ఇక తాజాగా ఆయన రూపొందించిన ‘అజ్ఞాతవాసి’ కథను అయితే ఏకంగా ఫ్రెంచ్ మూవీ ‘లార్గో వించ్’ నుంచి ఎత్తుకొచ్చేశాడు.

ఇలా త్రివిక్రమ్ ప్రతీది కాపీ కొడతాడు కాబట్టి.. ఎన్టీఆర్ 28వ చిత్రంలోనూ అదే పంథా కొనసాగిస్తాడని అంతా భావించారు. ఆమధ్య ఈ మూవీ కథకి సంబంధించి కొన్ని రూమర్లు కూడా చక్కర్లు కొట్టాయి. ‘షాడో’ అనే నవల ఆధారంగా ఎన్టీఆర్ మూవీకి కథ తయారు చేస్తున్నాడని.. ఆ నవలా రచయిత మధుబాబు కూడా రచనా సహకారం అందిస్తున్నారని వార్తలొచ్చాయి. ఈ వార్తల్ని ఎవ్వరూ ఖండించకపోవడంతో.. నిజమేనని అంతా అనుకున్నారు. కానీ.. ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేనని లేటెస్ట్‌గా తేలిపోయింది. ఈ సినిమా కథ ‘షాడో’కి స్ఫూర్తి కాదని రివీల్ అయిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా మధుబాబే ధృవీకరించాడు.

త్రివిక్రమ్-ఎన్టీఆర్ మూవీకి తాను కథ అందిస్తున్నానని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మధుబాబు వెల్లడించారు. త్రివిక్రమ్ సినిమా విషయమై తనను ఎన్నడూ సంప్రదించలేదని, అవన్నీ కేవలం కట్టుకథలేనని ఆయన ఆ వార్తల్ని ఖండించాడు. ఈ లెక్కన.. ఎన్టీఆర్ మూవీకి త్రివిక్రమ సొంతంగా కథ రాశాడని తెలుస్తోంది. కాగా.. వచ్చే నెల్లోనే సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈ మూవీ వివరాల్ని త్వరలోనే యూనిట్ అనౌన్స్ చేయనుంది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.